సాధార‌ణంగా ఆముదం అందరికీ తెలిసిందే. ఆముదం చెట్టు గింజల నుంచి తీసే తైలం. భారతదేశంలో ఆముదం వినియోగం క్రీ.పూ. 2000 నుంచి ఉంది.  దీనిని దీపాలు వెలిగించడానికి, ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు. వాతరోగాలను పోగొట్టడంలో దీనిది అగ్రస్థానం. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదంనూనెతో మర్దనచెయ్యడం ఇప్పటికి గ్రామీణప్రాంతాలలో కొనసాగుచున్నది. అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.


ఆముదంలో జుట్టును బలోపేతం చేయడానికి మంచి సామర్థ్యం ఉంది. ఇది చర్మం మరియు జుట్టు రెండింటి కోసం లోతైన కండీషనర్ గా పనిచేసేటటువంటి నూనె. ఆముదం నూనెలో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓమేగా 9 ఫ్యాటీయాసిడ్స్ ఉండటం వల్ల, ఈ రెండా హెల్త్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. అలాగే రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల ఆముదం నూనె కొత్తగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆముదం, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్లకు మర్దన చేస్తే, కాళ్లలో వచ్చే మంటలు త్వరగా తగ్గిపోతాయి.  ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లును నయం చేస్తుంది. 


కీళ్ల నొప్పులను నివారణతోపాటు, సుఖనిద్రకు ఆముదం సహాయపడుతుంది. ఆముదంలో ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. తరుచుగా పెదాలు పొడిబారినట్టుగా అవుతుంటే.. కొద్దిగా ఆముదం రాసి చూడండి. మార్పు ఖ‌చ్చితంగా కనిపిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో దీని పాత్ర అమోఘం. ఇది అందానికీ చక్కగా ఉపయోగపడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: