ప్రస్తుత కాలంలోని మానవుడు కల్తీ ఆహారం, మరియు సురక్షితం కాని నీరు, అన్నిటికంటే ముఖ్యంగా కొంతవరకు కలుషితమైన గాలిని పీల్చడం వలన తన జీవన ప్రమాణాన్ని రోజురోజుకు తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనే చెప్పాలి. ఒకప్పటి మనిషి ఆయుష్షుతో పోలిస్తే, నేటి మనిషి పరిస్థితి ఏడాది గడిచే కొద్దీ మెల్లగా తగ్గుతోంది. ఇక మనలో ఎక్కువమంది కొన్ని రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారు. వారిలో అనేకులు, సమయానికి నిద్ర పట్టని కారణంగా అల్జీమర్స్, మతిమరుపు, వంటి వ్యాధుల బారిన పడుతూ రకరకాల మందులు మింగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. 

అయితే ఇటువంటి వాటన్నిటికీ చెక్ పెట్టె అంశం ఒకటి ఉందని, ఇటీవల కొందరు చైనాకు చెందిన సైంటిస్టులు కనిపెట్టడం జరిగింది . అది ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా రోజూ క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటారో, అటువంటి వారిలో హృద్రోగ సమస్యలు, మరియు మానసిక ఒత్తిడికి సంబందించిన సమస్యలు, అలానే నిద్రలేమి వంటివి వచ్చే అవకాశం చాలావరకు తక్కువని తేలిందట. నిజానికి మనలో చాలా మంది శృంగారం అంటే ఏదో ఒక మాములు రోజువారీ పని మాదిరిగా భావిస్తారు. అయితే అలా కాకుండా భార్య భర్తలిద్దరూ శృగారంలోని మంచి భావ ప్రాప్తిని అనుభవిస్తూ జరిపితే, ఇద్దరికీ సమానంగా తృప్తి కలిగి శరీరంలోని ప్రధాన అవయవాలు తేలికపడతాయని, అంతేకాదు ముఖ్యంగా ఎవరైతే రోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటారో అటువంటి వారు మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు కొందరిపై చేసిన పరిశోధనలో తేలినట్లు చెప్పారు. 

మరొక విషయం ఏమిటంటే, మనిషి ఏదైనా ఒక పనిని మరింత తృప్తి మరియు ఆనందంతో అనుభవిస్తూ చేస్తే మెదడు విశ్రాంతిని పొంది, గుండె వేగంగా పనిచేస్తూ ఉంటుందని, తద్వారా ఆ తరువాత శరీరం ఎంతో విశ్రాంతిని పొందడం జరుగుతుందట. ఇక అటువంటివారు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా ఉందని చెపుతున్నారు. ఇక శృంగారం ఎక్కువగా జరిపిన కొందరు యువతీ యువకుల్లో ఈ విషయం బాగా కనపడిందని వారు చెపుతున్నారు. అయితే శృంగారం జరుపని ఎక్కువమందిలో ఒత్తిడి తగ్గకపోవడం, మానసికంగా నిరాశ నిస్పృహలకు గురికావడం, తద్వారా జీవితాన్ని ఛిద్రం చేసుకోవడం వంటివి చేస్తుంటారని, అది ఒకరకంగా మన ఆయుష్షుకు తీవ్ర ముప్పుగా కూడా పరిణమిస్తుందని అంటున్నారు. సో విన్నారుగా ఫ్రెండ్స్ మన జీవితంలో తిండి మరియు నిద్రతో పాటు శృంగారం కూడా సమపాళ్లలో అవసరం అని తేలింది కదా....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: