కావాల్సిన ప‌దార్థాలు: 
బ్రెడ్‌ స్లైసులు- 15
మజ్జిగ- రెండున్న‌ర‌ కప్పులు
ఉల్లిపాయలు- రెండు
పచ్చి మిరపకాయలు- 5
క్యారెట్‌- ఒకటి


బియ్యం పిండి- రెండు చెంచాలు
కరివేపాకు- రెండు రెబ్బలు
నెయ్యి- రెండు చెంచాలు
నూనె- తగినంత
టమోట- ఒకటి


అల్లం- చిన్నముక్క
ఉప్పు- తగినంత
కారం- అరచెంచా
కొత్తిమీర- కొద్దిగా
బీన్స్‌- 5


తయారీ విధానం:
ముందుగా శాండ్‌విచ్‌ బ్రెడ్‌ తీసుకుని అంచులు తీసేసి చిన్నచిన్న ముక్కలుగా చేసి మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఓ పాన్‌లో నెయ్యి వేసి పోపు పెట్టి వేగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌, బీన్స్‌, పచ్చిమిర్చి, అల్లం, టమోట ముక్కలు వెయ్యాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం వేయాలి. 


ఈ మిశ్రమం కొంచెం మగ్గిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగలో నానిన బ్రెడ్‌ ముక్కలు, బియ్యం పిండి, మిగిలిన మజ్జిగ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని వేయించి పెట్టుకున్న మిశ్రమానికి కలిపి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పెనంపై ఊతప్పంలా వేసుకుంటే స‌రిపోతుంది. అంతే  య‌మ్మీ య‌మ్మీ బ్రెడ్ ఊత‌ప్పం రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: