సాధార‌ణంగా  అనేక కారణాల వల్ల చాలామంది అధిక బరువుతో బాధ పడుతుంటారు. ఈ సమస్య ముఖ్యంగా యువతరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది.  అధిక బరువు ఉండి  ఎలాంటి పని చేయలేకపోతున్నాం అని అర్థంతరంగా తనువూ  చాలించినవారు చాలా మంది ఉన్నారు. ఈ అధిక బరువు ఉన్నవారి కోసం  పట్టణాలలో అనేక వ్యాయామ శాలలు, అలాగే అనేక ఆసుపత్రిలు కొత్త రకమైన ట్రీట్ మెంట్ లతో  చాలా డబ్బులు గుంజుతున్నారు. వాస్త‌వానికి ఇంట్లోనే స‌రైన జాగ్ర‌త్త‌లు పాటిస్తే అధిక బ‌రువును సులువుగ‌గా త‌గ్గించుకోవ‌చ్చు.


ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయాయం చేయాలి. కనీసం జాగింగ్‌, వాకింగ్‌ అయినా అరగంట సమయం తీసుకుని చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరానికే కాకుండా.. మానసికోల్లాసంగా కూడా ఉంటారు. కొవ్వు, ఆయిల్, ఐస్ పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటమే చాలా మేలు. శరీరానికి ఫైబర్‌ ఫుడ్‌ చాలా ముఖ్యం. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, బరువు తగ్గించడంలో ఫైబర్‌ మంచిపాత్రని పోషిస్తుంది. 


అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఓట్స్‌, గోధుమలు, మొక్కజొన్న, బీన్స్‌ ఇలాంటి వాటిల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మనం ఏమైనా తినే సమయంలో తొందరతొందరగా తిన కూడదట, అలా తినడం వలన ఆహారం తొందరగా జీర్ణం కాకుండా అజీర్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: