కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్‌- పావు కిలో
బిర్యాని ఆకు- 1
లవంగాలు- 4
రివేపాకు- కొద్దిగా


పసుపు- చిటికెడు
నూనె- 3 టీస్పూన్లు
యాలకుల - 2
దాల్చిన చెక్క- చిన్నది
కొత్తిమీర‌- కొద్దిగా


కారం- పావు టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒకటిన్నర టీస్పూను
గరం మసాలా- అర టీస్పూను
ఉల్లిముక్కలు- అర కప్పు


తయారీ విధానం: 
ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద‌ పాన్ పెట్టుకొని, అందులో నూనె పోసి బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత  చికెన్‌ ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు కూడా వేసి కలపాలి. స్లో ఫ్లేమ్‌ మీద ఉంచి నీరు వదిలేదాకా మూడు, నాలుగు నిమిషాలపాటు వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి క‌ల‌పాలి. 


ఐదు నిమిషాల‌ తర్వాత కారం, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తబడేవరకూ స్లో ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించాలి.  చికెన్ ముక్క‌లు బాగా వేయించి, చివ‌రిగా కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా చికెన్ రోస్ట్ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: