సాధార‌ణంగా పిల్లలు ఎప్పుడు, ఎందుకు ఏడుస్తారో తెలుసుకోవడం తల్లికి కూడా చాలా కష్టమైన పనే. ఏడుపు విషయంలో పసిపిల్లలు నోరు తెరచి ఇందుకే ఏడుస్తున్నాను అని చెప్పలేరు కాబట్టి తల్లే బిడ్డ గురించి తెలుసుకోవాలి. ఆకలి మొదలు అనారోగ్యం వరకు పిల్లలు ఏడవటం సహజమే. అయితే పిల్లల పెంపకం మీద అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లలు పట్టుమని 10 నిమిషాలు ఏడవగానే.. ఆసుపత్రికి పరుగులు పెడుతుంటారు. ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం పిల్లల పెంపకం మీద అవగాహన పెంచుకోవటమే.


నిజానికి, పిల్లల భాష ఏడవడమే. అయితే శిశువు పుట్టగానే శిశువు యొక్క మొదటి ఏడుపు కోసం అంద‌రూ ఎంతో ఎక్సైటింగ్ గా ఉంటారు. అయితే శిశువు మొదటి ఏడుపు ఎందుకంత ప్రాముఖ్యత అంటే, బేబీ శ్వాసతీసుకోవడానికి మరియు ఊపిరితిత్తులు తెరచుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి, వారు ఏడ్చేటప్పుడు, ఊపిరితిత్తులు మరింత స్ట్రాంగ్ గా పనిచేస్తాయి. కొందరు పిల్లలు ఎప్పుడో ఓసారి, మరికొందరు ప్రతిదానికీ ఏడుస్తుంటారు. అయితే పిల్లలు దప్పికగా ఉన్నా, ఆకలి వేసినా ఏడుస్తారు. 


నిద్ర వేళకి ఆహ్లాదకరమైన వాతావరణం లేకున్నా, పెద్దపెద్ద శబ్దాలు విన్నా, నిద్ర చాలకపోయినా, విద్యుత్ లేకపోయినా, తాము ఏకాతంగా ఉన్నట్టు అనిపించినా అసౌకర్యంగా ఉండి ఏడుస్తారు. డైపర్ లో మలమూత్ర విసర్జన చేసి, దానిని వెంటనే పట్టించుకోక పోతే కూడా పిల్లలు చిరాకుతో ఏడుస్తారు. జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తారు. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ప‌సిపిల్ల‌లు ఏడుస్తుంటారు. సో.. ఇలాంటప్పుడు పిల్లలను గమనిస్తూ, వారి ఏడుపును త‌ల్లి అర్థం చేసుకొని దానికి తగినట్లు స్పందించాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: