జీవితం. వినడానికి చిన్న పదమే కాని దాన్ని సరైన రీతిలో బ్యాలన్స్ చేసుకుని ముందుకు వెళ్లకుంటే ఎదురయ్యే పరిణామాలు కఠినంగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో మనిషి జీవితంలో మానసిక ఒత్తిడి అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఇది ఎక్కువగా యువతీ యువకుల్లో కనిపిస్తుంది.. చదువు, ఉద్యోగం తదితర కారణాలతో యువత విపరీతమైన ఒత్తిడికి గురవుతోంది. ఒకరకంగా ఈ అంశం ఆందోళనకు గురిచేసేదిగా పేర్కొనవచ్చూ. అయితే ఒత్తిడిని పట్టించుకోకపోవడం వల్ల అనర్థాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.


ఈ ఒత్తిడిని జయించేందుకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం తప్పా వేరేమార్గం లేదని, మెడిటేషన్, యోగాభ్యసన వంటి కార్యక్రమాల ద్వారా ఒత్తిడి నుంచి బయట పడొచ్చని సూచిస్తున్నారు..ఇలా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల కోసం రామకృష్ణ మఠం ప్రత్యేకంగా ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఈ ప్రోగ్రామ్‌లో మెదడుపై ఆలోచనల ప్రభావం, వాటి నియంత్రణ, ఆలోచనలను తగ్గించుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవడం, సంతోషంగా ఎలా జీవించాలనే విషయాలపై స్వామి బోధమయానంద స్వామి విద్యార్థులకు విలువైన సూచనలు చేస్తారని. ఈ  ప్రత్యేక కార్యక్రమం 16 నుంచి 25 ఏళ్లలోపు వారి కోసం రూపొందించారని తెలిపారు.


ఈ పోగ్రాంలో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చదువు-జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటుగా, అనవసరమైన ఆలోచనలను నియంత్రించుకోవడంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఒత్తిడి ఉపశమన విధానాలపై తర్ఫీదునిస్తారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్’ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో ఈ నెల 21(సోమవారం) నుంచి వారం రోజుల పాటు కొనసాగుతుందని సంస్థ నిర్వహకులు తెలిపారు..  ఇంకెందుకు ఆలస్యం జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించే వారు ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోగలరు..


మరింత సమాచారం తెలుసుకోండి: