హైదరాబాద్ భారతదేశంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న నగరంలో ఒకటి .ఇక్కడ రాష్ట్ర రాజధాని  హైదరాబాద్లో  జనాభా కోటి పైన ఉంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న  తెలంగాణ రాష్ట్రం. ఢిల్లీని  ఒక వింత విషయంలో పోటీ పడుతూ ఉంది. అది అందరికీ నచ్చే అభివృద్ధి కాదు.వాహన కాలుష్యంలో గ్రేటర్‌ నగరం త్వరలో దేశ రాజధాని ఢిల్లీని మించిపోయే ప్రమాదకర సంకేతాలు వెలువడుతున్నాయి. 


ఉదయం మంచు.. మధ్యా హ్నం ఆకాశం దట్టమైన క్యుములోనింబస్‌ మేఘాలతో ఆవృతమై పట్టపగలే కమ్ముకుం టున్న కారు చీకట్లు.. సాయంత్రం జడివాన.. దీనికితోడు భరించలేని స్థాయిలో పెరిగిన వాయు కాలుష్యం.. గాలిలోని తేమతో సమ్మి ళితం.. ఇదీ నగరంలో కొన్ని రోజులుగా నెల కొన్న వినూత్న వాతా వరణ పరిస్థితులు.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గాలిలో తేమ శాతం 87 శాతానికి చేరు కోవడంతో ధూళి కణాలు, వాహనాల నుంచి వెలువడుతోన్న నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు గాలిలోని తేమతో కలిసిపోతుండ టంతో సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించే పరి స్థితి కూడా చాల  కష్టమవుతోంది. 


ఢిల్లీలో నైట్రోజన్‌ ఆక్సైడ్స్, సల్ఫర్‌ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్‌ మోనాక్సైడ్, క్లోరో ఫ్లోరో కార్బన్లు అధికమై జనం శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఘనపు మీటరు గాలిలో లెడ్‌ మోతాదు 0.75కు మించరాదు. కానీ 2 మైక్రోగ్రాములకు మించింది.దీనికితోడు దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో ఇటీవల 200 మీటర్ల దూరం ఉన్న వస్తువులను సైతం ఢిల్లీ వాసులు చూడలేకపోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది.


 ఘనపు మీటరు గాలిలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ 120 మైక్రో గ్రాములకు మించరాదు. మన నగరంలో 135 మైక్రో గ్రాములుగా నమోదవుతోంది.ఘనపు మీటరు గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ మోతాదు ఒక మైక్రోగ్రాము మించరాదు. కానీ నగరంలో 2 మైక్రో గ్రాములుగా నమోదవుతుంది.నగరంలో వాహన కాలుష్యం భవిష్యత్‌లో ఢిల్లీని మించే ప్రమాదం ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య భరితమైన బీజింగ్‌ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు స్మోక్‌ కలెక్టివ్‌ టవర్స్‌ ఏర్పాటు చేశారు. మన దగ్గర కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: