హైదరబాద్ నగరానికి ప్రముఖ చారిత్రక చిహ్నంగా నిలిచే చార్మినార్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఫలక్ నుమా ప్యాలెస్ ఉంది. ఫలక్‌నుమా అనే ఉర్దూ పదానికి తెలుగులో అర్థం ‘ఆకాశ దర్పణం’ అని అర్థం. ఇక నిర్మాణం మాత్రం ఆకాశం ఛత్రం కింద అద్దంలా మెరిసేలాగా ఉంటుంది. ప్రపంచంలోని ఉత్తమ భవనాల్లో ఒకటిగా నిలిచిన ఈ   ఫలక్‌నుమా ప్యాలెస్‌. ఫలక్ నామ ప్యాలెస్‌ నిర్మాణం  ఆరో నిజాం నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో జరిగింది. చార్మినార్‌కు ఐదు కి.మీ దూరాన ఉన్న కొండపై 1884లో శంకుస్థాపన చేయగా. దాదాపు పదేళ్ల పాటు నిర్మాణం కొనసాగి 1894 అక్టోబర్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది  ప్యాలెస్ . అంటే ఈ ఇంద్రభవనానికి ఈ అక్టోబర్‌ నెలతో 125 ఏళ్లు పూర్తయ్యాయి అని తెలుస్తుంది.


ఇక ఏడో నిజాం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను 'రాయల్ గెస్ట్ హౌస్‌'గా ఉపయోగించుకున్నారు. 2010లో ఈ హోటల్‌ను నిజాం వారసుల నుంచి తాజ్ హోటల్స్ గ్రూప్ వాళ్ళు  అద్దెకు తీసుకోవడం జరిగింది. మొత్తం ప్యాలెస్‌లో 60 గదులు, 22 హాళ్లు ఉన్నాయి. నిజాం తన అభిరుచి మేరకు అపురూపమైన కళాఖండాలు, విగ్రహాలు, ఫర్నీచర్, పుస్తకాలు, తైలవర్ణ చిత్రాలు, విలువైన గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని ప్యాలెస్‌లో ఏర్పాటు  కూడా చేయడం జరిగింది.


ఇక ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ హాల్‌గా పేరు ఉన్న ప్యాలెస్‌లోని '101 డైనింగ్ హాల్'లో  విందు లబిస్తుంది. హాల్‌లో 108 అడుగల పొడవైన టేబుల్స్ ఉంటాయి. ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంది. ఇక టేబుల్స్ ని ప్రత్యేక కలపతో తయారు చేశారు.. పొడవు 80 అడుగులు, వెడల్పు 5.7 అడుగులు, ఎత్తు 2.7 అడుగులుగా ఉంది. ఈ టేబుల్‌ పైభాగాన్ని తయారు చేయడానికి ఏడు పొడవైన కలప దుంగలను ఉపయోగించారంట. 


ఇక 2000 సంవత్సరం మునపటి వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్‌లోకి అనుమతినిచ్చే వారు కాదు. కానీ.. తాజ్ గ్రూప్  ప్యాలెస్ ను  అద్దెకు తీసుకున్న తర్వాత.. దీనిని మరింత ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఈ హోటల్లో ఎవరైనా వెళ్లి భోజనం చేయవచ్చు. నచ్చిన పదార్థాలు, ఏమి కావాలంటే అవి తినవచ్చు. అయితే.. ఈ టేబుల్‌పై భోజనం చేయాలంటే అతి తక్కువలో తక్కువ 40 మంది కచ్చితంగా ఉండాలి. ఇక ఇక్కడ బస చేయాలంటే మాత్రం చాలా ఖరీదు . కేవలం భోజనం ఖరీదు రూ.5 వేలు. ప్రత్యేక టేబుల్‌ దగ్గరైతే రూ.18వేలు. ఒకరోజు ఉండటానికి సుమారు 46  వేలు చెల్లించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: