కావాల్సిన ప‌దార్థాలు: 
మైదాపిండి- ఒకటిన్నర కప్పులు
క్యాప్సికమ్‌ ముక్కలు- కప్పు
పచ్చిమిర్చి- 1
అల్లంతురుము- టీస్పూను
అనాసపువ్వుపొడి- అరటీస్పూను


గరంమసాలాపొడి- 2 టీస్పూన్లు
సెనగపిండి- టీస్పూను
జీలకర్రపొడి- అరటీస్పూను 
మిరియాలపొడి- టీస్పూను


ఉప్పు- తగినంత
బంగాళాదుంప- ఒకటి
స్వీట్‌కార్న్‌- కప్పు
నూనె- వేయించడానికి సరిపడా
కొత్తిమీరతురుము- 2 టేబుల్‌స్పూన్లు


తయారీ విధానం:
ముందుగా మైదాలో ఉప్పు, నూనె వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి తడిబట్ట కప్పి సుమారు అర‌గంట‌ నిమిషాల పాటు పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో రెండు టీస్పూన్ల నూనెవేసి సెనగపిండి వేసి వేయించి తీయాలి. అందులోనే మళ్లీ రెండుటీస్పూన్ల నూనెవేసి ఉడికించిన స్వీట్‌కార్న్‌, బంగాళాదుంప‌ముక్క‌లు, క్యాప్సికమ్‌ముక్కలు, అల్లంతురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. 


ఇప్పుడు వేయించిన సెనగపిండి, గరంమసాలా, మిరియాలపొడి, జీలకర్రపొడి వేసి రెండునిమిషాలపాటు వేయించి దించాలి. పిండిముద్దను చపాతీల్లా చేసి రెండుగా కోసి కోనుల్లా చుట్టి మిశ్రమాన్ని పెట్టి సమోసాలా మడిచి కాగిన నూనెలో వేయించి తీయాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్‌కార్న్‌ క్యాప్సికమ్‌ సమోసా రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: