కావాల్సిన ప‌దార్థాలు:
గుడ్లు- 3 
టమోటో- ఒక‌టి 
పాలు- ఒక స్పూను
ఉప్పు- రుచికి సరిపడా


ఉల్లిపాయలు- ఒక‌టి
చిక్కుడు గింజలు- కొద్దిగా
నెయ్యి- ఒక‌టి స్పూను
పచ్చిమిర్చి- రెండు


స్రింగ్‌ బీన్స్- ఒక‌టి 
కారం- 1/2 స్పూను
కొత్తిమీర- కొద్దిగా


తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సింగ్‌ బౌల్లో గుడ్లను పగులగొట్టి అందులో పోయాలి. అందులోనే మిగిలిన పదార్థాలు, ఒక చెంచా పాలు, క‌ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటోలు, చిక్కుడు గింజలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారంపొడి వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత ఫ్రైయింగ్‌ పాన్‌ తీసుకుని.. దాని మీద కొద్దిగా నూనె లేదా బట్టర్‌ రాసి మిక్స్‌ చేసి పెట్టుకొన్న ఎగ్‌ వెజిటేబుల్‌ మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా వేయాలి. 


స్లో ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల పాటు ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకుని బేక్‌ చేసుకోవాలి. తర్వాత ఒకటి రెండు నిమిషాలు స్టౌమీద అలాగే ఉంచి ఆ తర్వాత సర్వింగ్‌ ప్లేట్‌ లోనికి తీసుకొని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే స‌రిపోతుంది. అంతే  హెల్తీ హెల్తీ వెజిటేబుల్‌  ఆమ్లె‌ట్ రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: