సాధార‌ణంగా ఒక వ్యక్తి శరీరం కానీ, మెదడు కానీ సరైన క్రమంలో పనిచేయాలంటే కంటి నిండా నిద్ర అవసరం. అప్పుడే మానవ శరీరం ఆరోగ్యకరమైన పనితీరుతో వేగవంతమైన ఆలోచనలతో పనిచేస్తుంది.  నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రిస్తేనే.. మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. సరైన నిద్రలేని వారి మెదడు, క్రమంగా ఆలోచనా స్థాయిలను కూడా కోల్పోతుందని మనకు తెలియనిది కాదు.  


అయితే ప్రశాంతమైన నిద్రను పొందాలంటే నిద్రించే సమయంలో మీ పాదాలకు సాక్సులను ధరిస్తే సరిపోతుందని అంటున్నారు. 
పాదాలకు సాక్సులు ధరించి పడుకున్నప్పుడు పాదాలు వెచ్చగా ఉండటంతోపాటు రక్త నాళాల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది.  నిద్రకు ఉపక్రమించేముందు సాక్స్ ధరించే పెద్దలు వేగంగా మరియు ఘాడమైన నిద్రలోకి వెళ్తున్నారని కూడా ఒక అధ్యయనంలో తేలింది. కాళ్ల‌కు సాక్సులు వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌రణ మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.


రాత్రి పూట సాక్సుల‌ను ధ‌రించి నిద్రించ‌డం వ‌ల్ల పాదాలు మృదువుగా మారుతాయి. దీంతో ప‌గుళ్లు, ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. శరీరంలో అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఆవిర్లు, చెమటలు రేకెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని హాట్‌ ఫ్లాషెస్‌ అని కూడా అంటారు. అయితే సాక్సులు వేసుకుని నిద్రిస్తే శరీర అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణలో సహాయపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: