2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు,  పది నగరాల జాబితాను లోన్లీ ప్లానెట్‌ పుస్తకం విడుదల చేసింది. ఈ జాబితాకు సంబంధించిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్‌కు దక్కగా రెండు, మూడు స్థానాలు ఇంగ్లండ్ కు  మెర్సిడోనియా ప్రాంతాలకు దక్కింది. తర్వాతి స్థానాల్లో  అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు నిలిచాయి.


దాని తర్వాత పర్యటించాల్సిన ప్రాంతాల్లో సెంట్రల్‌ ఆసియాలోని సిల్క్‌ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్‌లోని తొహొకు, అమెరికాలోని మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని టెంగారా,  ఇండియాలోని మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపెస్ట్‌ తదితరాలు ఉన్నాయి. ఇకపై చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్‌బర్గ్, వాషింగ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి.  జర్మనీలో బాన్, బొలీవియాలోని లాపాజ్, వాంకోవర్, మనదేశంలోని కోచి, యూఏఈలోని దుబాయ్, కొలరాడోలోని డెన్వర్‌ నగరాన్ని లోన్లీ ప్లానెట్‌ ఎంపిక తయారు చేసింది.  గుట్టలు, పచ్చని వాతావరణంతో పాటు గుట్టలు రమణీయంగా కనిపించే భూటాన్‌ను చూడాల్సిన మొదటి దేశంగా, టైమ్‌లెస్‌ ట్రెజర్‌గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌లో చారిత్రక కట్టడాలు, చర్చిలు చూడముచ్చటగా ఉంటాయని పేర్కొంది.


 అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు వాటిని ఎందుకు సందర్శించాలో లోన్లీ ప్లానెట్ పుస్తకంలో వివరించింది. ఈ జాబితాలో భూటన్ లో చారిత్రక ప్రదేశాలు ముఖ్యమైన స్థానాలుగా లోన్లీ ప్లానెట్ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకులు సందర్శిస్తుండగా.. ప్రపంచ వ్యాప్తంగా వీటిని మరింత ప్రచారం చేయాల్సిన అవసరముందని లోన్లీ ప్లానెట్ వివరించింది.

కాగా దుబాయ్ లోని ఎత్తైన కట్టడాలతో పాటు పామ్ ఐల్యాండ్ కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాలో చోటు కల్పించామని లోన్లీ ప్లానెట్ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ఏదో ఒక చోటికి వెళ్లి రావడానికి.


మరింత సమాచారం తెలుసుకోండి: