పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఆశపడే ది చాక్లెట్. పిల్లలు చాక్లెట్లు ఇస్తామంటే ఎంత దూరమైనా పరిగెడతారు. పిల్లల పుట్టిన రోజు కూడా తమ స్నేహితులకు అందరూ చాక్లెట్లను పంచుతారు. ఈ చాక్లెట్లను రకరకాల డిజైన్లలో అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. చాక్లెట్  కంపెనీలలో ఎంతో మంది నిరుద్యోగులు తమ జీవనోపాధిని పొందుతున్నారు అయితే ప్రపంచములోనే అత్యంత ఖరీదు అయినా చాక్లెట్లను ఐటిసి సంస్థ మంగళవారం ఆవిష్కరించింది దీని ధర సుమారు ఒక కేజీ ధర 4.3 లక్షల రూపాయలు అని పేర్కొంది. 


ఇంత ఖరీదైన చాక్లెట్ ను తయారు చేయడం ఇదే మొదటిసారి. ప్రత్యేకమైన  ప్యాబెల్ ఎక్స్ క్విజిట్ బ్రాండ్ లో ట్రినిటీ ట్రపల్స్ ఎక్స్ ట్రార్డినెయిర్ పేరిట పరిమిత శ్రేణిలో వీటిని ఐటీసీ సంస్థ ప్రవేశపెట్టింది. కానీ వీటిని మధ్యతరగతి మనుషులు కొనడానికి చాలా జంకుతారు.


ఐటీసీ సంస్థ కన్నా ముందుగా 2012లో డెన్మార్క్ కు చెందిన అయితే అయితేఒక చాక్లెట్ సంస్థ ఒక కేజీ చాక్లెట్ ఖరీదు 3.39 లక్షల రూపాయలుగా ప్రకటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నది. అయితే ఇప్పుడు ఐ.టీ.సీ సంస్థ ప్రవేశపెట్టిన చాక్లెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ గా పరిగణించబడింది. ఈ చాక్లెట్టు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం అరుదైన విశేషము. 


ఈ చాక్లెట్లను చేతితో తయారు చేసిన చెక్కపెట్టెలో ఇవి లభ్యం అవుతున్నాయి. అందులో ఒక్కొక్క చాక్లెట్టు 15 గ్రాములు బరువు కలిగి ఉంటుంది. ఈ చెక్క పెట్టెలో15 విభిన్న ట్రపల్స్ ఉంటాయి ఈ చాక్లెట్లు. చెక్కపెట్టె ధర సుమారు లక్ష రూపాయలు ఉంది అని సంస్థ పేర్కొన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: