రోజులు మారుతున్న కొద్ది మనషుల అభిరుచులు కూడా మారుతున్నాయి. అలా మారే అభిరుచులకు అనుకూలంగా మానవుడు తన లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటున్నాడు. ఇందుకోసం తన ఆలోచనలో మార్పుతెచ్చుకుంటూ, తన సౌకర్యం కోసం ఎన్నో కొత్త కొత్త వస్తువులను తయారుచేసుకుంటున్నాడు. అందులో మోబైల్స్ ఒకటి. ఈ సెల్‌ఫోన్లను ఎన్నో కంపెనీలు పోటీ పడుతూ మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్‌తో రిలీజ్ చేస్తున్నాయి. ఇకపోతే చైనా రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే, వరుస ఫోన్‌ లాంచ్‌లతో అదరగడుతున్న హువావే ఉపసంస్థ హానర్ ఇప్పడు మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 20 సిరీస్ లో భాగంగా హానర్ 20 లైట్(యూత్ ఎడిషన్)ను హానర్ సంస్థ బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసిన ఈ మొబైల్ మరి కొన్ని నెలల్లోనే భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


ఇకపోతే ఇందులో మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,399 యువాన్లు(సుమారు రూ.14 వేలు)గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా(సుమారు రూ.15 వేలు) ఉండగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా(సుమారు రూ.17 వేలు)గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను 1,899 యువాన్లకు(సుమారు రూ.19 వేలు) విక్రయిస్తున్నఈ ఫోన్లు బ్లాక్, గ్రీన్, బ్లూ-పింక్ గ్రేడియంట్ రంగుల్లో లభించనుంది.


కాగా చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అవ్వగా, అక్టోబర్ 25 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్ల తరహాలోనే ఇందులో కూడా కెమెరాకి పెద్ద పీట వేశారు. మూడు కెమెరాల సెటప్ ను ఈ ఫోన్ లో వెనకవైపు అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ను, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ను అందించారు. కెమెరా కోసం సూపర్ నైట్ సీన్ మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్, పొర్ ట్రెయిట్ మోడ్ కూడా ఇందులో ఉన్నాయి.


అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తరహాలో ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ ను అందించారు. ప్రాసెసర్ విషయానికి వస్తే.. కిరిన్ 710F ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పనిచేస్తుంది. 4 జీబీ నుంచి 8 జీబీ వరకు వివిధ ర్యామ్ ల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మెమొరీ కార్డును వేసుకోవడానికి ఇందులో మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ని కూడా అందించారు...చూసారుగా ఇంకెందుకు ఆలస్యం నచ్చితే బుక్ చేసుకోడానికి ఆలోచించకండి.


మరింత సమాచారం తెలుసుకోండి: