పంచంలోని అన్ని హోటళ్లలో స్త్రీ, పురుషులకు ప్రవేశం ఉంటుంది. అయితే, ఈ ప్రతేకమైన హోటల్లో మాత్రం కేవలం మహిళలే ప్రవేశించాలి. కనీసం మగ పురుగు వచ్చినా మడతెట్టేస్తారు. ఏంటి ఇలాంటి హోటల్ ఎక్కడుండి అనుకుంటున్నారా..??? అయితే ఓ లుక్కేయండి మరి.. స్పెయిన్లోని బాలెయారిక్ దీవిలో ఈ హోటల్ ఉంది. దాని పేరు.. సోమ్ డోనా హోటల్.
అంటే ఆ హోటల్ పేరుకు ‘మేము మహిళలం’ అని అర్థం. 14 ఏళ్లు దాటిన ఆడవాళ్లంతా ఈ హోటల్లో ఉండవచ్చు. కొన్నాళ్లు మగాళ్లకు దూరంగా.. ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మహిళలకు ఇదే సరైనదని హోటల్ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ హోటల్లో మగాళ్లు ఉండేందుకు అవకాశం/ అనుమతే లేదు. అంతేకాదు.. ఆ పరిసరాల్లోకి కూడా పురుషులు అడుగు కూడా పెట్టరు. వాళ్లు ఆ మహిళకి సంబంధించిన కుటుంబికులు లేదా స్నేహితులైనా సరే.. లోపలికి అనుమతించరట.
ఈ హోటల్లో మహిళలకు పటిష్టమైన భద్రత ఉంటుందట.. ఎలాంటి ఢోకా ఉండదని యాజమాన్యం తెలిపింది. దురదృష్టం ఏమిటంటే.. ఈ హోటల్లో సిబ్బందిని కూడా మహిళలతోనే నింపేయాలని యాజమాన్యం భావించింది. కానీ, ప్రభుత్వ నిబంధనలు ఇందుకు అడ్డువచ్చాయి. ఉపాధిలో వివక్ష ఉండరాదనే నిబంధనపై కొంతమంది పురుషులకు ఈ హోటల్లో ఉద్యోగం కల్పించారు.
వీరి వల్ల మహిళలకు ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు పురుష ఉద్యోగులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.