సమ్మర్‌ లో కూల్‌గా గడపాలంటే, కర్నాటకలోని చిక్‌మగళూరు కేరాఫ్‌ అడ్రస్‌.
 సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటం.. నిత్యం చిరుజల్లులు పడుతుండటం, చల్లటి వాతావరణం ఉండటంతో వేసవి కాలంలో దేశం నలుమూలల నుంచి చిక్‌ మగళూరుకు పర్యాటకులు తరలివస్తున్నారు. చిక్‌మగళూరులో, చూడదగ్గ ప్రదేశాలు..

 1, హొరనాడు దేవాలయం .
భద్రనది తీరాన ఉండే హిందూ దేవాలయంగా హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం ప్రసిద్ధి గాంచింది. పశ్చిమ కనుమల భాగంలో ఉంటుంది. శాంతియుత వాతావరణం, అన్నదానం తదితర కార్యక్రమాలకు ప్రసిద్ధి.

2, హీరేకొలాల్‌ సరస్సు.
మానవ నిర్మిత శాంతికి ప్రతీకగా హీరేకొలాల్‌ సరస్సును పిలుస్తారు. చుట్టూ కొండ ప్రాంతాలు ఉంటాయి. మేఘాలు, మంచుతో కప్పుకుని అందంగా కనిపిస్తాయి.

 3, సర్వమతాల వారిని ఆకట్టుకునే, బాబా బుడాన్‌గిరి ముస్లిం పేరుతో చిక్‌మగళూరు జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతం కావడం విశేషం.
కుల మతాలకు అతీతంగా బాబా బుడాన్‌గిరి ప్రాంతాన్ని ఆదరిస్తారు. హిందూ, ముస్లి, క్క్రెస్తవులు పర్యాటకానికి వస్తారు. దత్తాత్రేయ పీఠం, బాబా బుడాన్‌ గిరి దర్గా ఎక్కువ ప్రసిద్ధి.

4, జెడ్‌ పాయింట్‌ .
.పచ్చని అందాల నిలయంగా జెడ్‌ పాయింట్‌ను పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో భాగమై ఉంది. జెడ్‌ పాయింట్‌ కొండను సులభంగా ఎక్కవచ్చు. బెంగళూరు నుంచి ప్రైవేటు రవాణా సంస్థల ద్వారా చేరుకోవచ్చు.

5, ముల్లాయనగిరి.
చంద్రద్రోణి కనుమల్లో ఉంది. కర్ణాటకలోనే ఎత్తైన పాంతం. భూ ఉపరితలానికి 1,950 మీటర్ల ఎత్తులో ఉంది. పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి. సూర్యాస్తమయం, నంది విగ్రహం ఆకట్టుకుంటాయి.
చిక్‌ మగళూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కుద్రేముఖ్ష ఒకటి .. పచ్చని కొండ ప్రాంతాలు చూపరులను ఆకట్టుకుంటాయి. కొండల మధ్యలో జలపాతాలు కనువిందు చేస్తాయి. కాదంబి వాటర్‌ ఫాల్స్‌ చూడదగ్గ ప్రాంతాలు. ఈ ప్రదేశాలన్నీ చూడాలనుకుంటే బెంగుళూరు నుండి ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కర్నాటకు టూరిస్టు కేంద్రాలను కూడా సంప్రదించ వచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: