ఎందుకంటే ఎన్నికల ముందు వరకు టీడీపీ నగర అధ్యక్షుడుగా ఉన్న రెహమాన్, వాసుపల్లికి ఏ మాత్రం సహకరించకుండా, వైసీపీ తరుపున పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాసరావుకు పరోక్షంగా మద్దతు తెలిపారు. అలా తనకు మద్దతు తెలుపకపోయినా సరే గణేష్ 4 వేల  ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే గణేష్ 2014లో కూడా ఇదే స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి కోలా గురువులుపై భారీ మెజారిటీతో గెలిచారు. కానీ 2009లో గణేష్ దారుణంగా ఓడిపోయి, మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక ఆ ఓటమి నుంచి గణేష్ తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చి వరుస విజయాలు అందుకున్నారు.

 

ఇక ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న గణేష్...ప్రజలకు అందుబాటులో ఉంటూ...వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే విశాఖ నగర అధ్యక్షుడుగా గణేష్ పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నారు.మిగతా నేతలు పెద్దగా పట్టించుకోపోయిన గణేష్ మాత్రం పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సమయంలో గణేష్... బాబుకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు.

 

అలాగే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటున్నారు. తన సొంత డబ్బులని ఖర్చు పెట్టి ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు కాదు ఆయన ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేసే విషయంలో సొంత డబ్బులని ఖర్చు పెట్టడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇక ఇక్కడ వైసీపీ తరుపున ద్రోణంరాజు ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నాసరే ద్రోణంరాజు పెద్దగా పుంజుకోలేదు. అయితే ఎన్నికల తర్వాత రెహమాన్ టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చేసారు. రెహమాన్ వచ్చినాసరే గణేష్ కు చెక్ పెట్టడం అవ్వడం లేదు.

 

ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే దక్షిణ స్థానం విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఉంది. గణేష్ బలంగా ఉండటం వల్ల దక్షిణ స్థానంలో టీడీపీ పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే వైసీపీ అధికారంలో ఉండటం, విశాఖని రాజధానిగా చేయనుండటం వైసీపీకి కాస్త అడ్వాంటేజ్. కానీ గణేష్ సొంత ఇమేజ్ వల్ల వైసీపీకి కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: