2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. పవన్ భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేయగా, ఆ రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఎన్నికలై సంవత్సరం అవుతుంది. ఇక ఈ సంవత్సర కాలంలో గాజువాకలో పవన్ ప్రత్యర్థిగా దిగి విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పనితీరు ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.

 

తిప్పలనాగిరెడ్డి రాజకీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే... ఆయన 1984లో కాంగ్రెస్‌లో చేరారు.  2007 జీవీఎంసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో గాజువాక నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. నెక్స్ట్ వైఎస్ చనిపోవడం, జగన్ పార్టీ పెట్టడంతో అందులోకి వచ్చి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయినా సరే నాగిరెడ్డి నియోజకవర్గంలోనే పనిచేసుకుంటూ...ప్రజలకు అండగా ఉన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో ఓ వైపు పవన్, మరోవైపు టీడీపీలు ప్రత్యర్థులుగా ఉన్నాసరే సూపర్ విక్టరీ కొట్టారు.

 

అయితే పవన్ మీద గెలవడంతో నాగిరెడ్డిపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలని నాగిరెడ్డి చేరుకోలేదనే తెలుస్తోంది. వయసు మీద పడటం వల్ల నియోకవర్గంలో పెద్ద యాక్టివ్ గా లేరని తెలుస్తోంది  ఎక్కువ పనులని ఆయన తనయుడు దేవన్ రెడ్డి చూసుకుంటున్నారని తెలుస్తోంది. కాకపోతే పెద్ద ఎఫెక్టివ్ గా అయితే పని చేయడం లేదట. ఇక వైసీపీలో గ్రూపు రాజకీయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీటు దక్కించుకోవాలని నాగిరెడ్డి దగ్గర బంధువు తిప్పల గురుమూర్తి రెడ్డి ప్రయత్నిస్తున్నారట. అటు నాగిరెడ్డి కూడా తన తనయుడు కోసం కష్టపడుతున్నారు.

 

ఇక ఇక్కడ టీడీపీ,జనసేనలు రెండు బలంగానే ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే, పవన్ భారీ మెజారిటీతో గెలిచేవారు. ప్రస్తుతానికైతే పవన్ గాజువాక మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే..ప్రస్తుతానికి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, మెజారిటీ స్థానాలు ఆ పార్టీకే దక్కే అవకాశముంది. కాకపోతే టీడీపీ, జనసేనలు గట్టి పోటీనే ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: