సాధారణంగా రాజకీయాల్లో సీనియర్ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యువ నేతలకు అరుదుగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ జగన్ లాంటి వారైతే...భవిష్యత్ యువనేతలదే కాబట్టి, వారికి మంచి ప్రాధాన్యత ఇస్తారు. అలా అని సీనియర్ నేతలని తక్కువ చేయరు. ఇక ఆ విధంగా జగన్...అత్యంత ప్రాధాన్యత ఇచ్చే యువనేతల్లో గుడివాడ అమరనాథ్ కూడా ఒకరు.

 

తండ్రి గుడివాడ గురనాథరావు వారసత్వాన్ని తీసుకున్న అమరనాథ్ 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. 2007 లో టీడీపీలో చేరిన గుడివాడ..అప్పుడు జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 65 వార్డు కార్పొరేటర్ గా విజయం సాధించారు. అయితే తర్వాత అనూహ్య పరిణామాల మధ్య వైసీపీలోకి వెళ్లి 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్ దూకుడుగా పనిచేస్తున్నారు. మంచి వాక్చాతుర్యంతో ప్రతిపక్షానికి సైతం చెక్ పెడుతున్నారు. ప్రజలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే అమరనాథ్ కు సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారు. సీనియర్ నేత దాడి వీరభద్రరావు , అమరనాథ్ ని నెగిటివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ గా అమరనాథ్ సరిగా పనిచేయట్లేదని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.

 

ఇదే సమయంలో అమరనాథ్ కూడా, దాడి ఫ్యామిలీని రాజకీయంగా ఎదగనివ్వకుండా చూస్తున్నారని టాక్. దాడి తనయుడు రత్నాకర్ కు అనకాపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం కూడా దక్కనివ్వలేదట. అందుకే దాడి ఫ్యామిలీ  అమరనాథ్ ని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే అమరనాథ్ కు..జగన్, విజయసాయి రెడ్డిల సపోర్ట్ బాగా ఉంది. ముఖ్యంగా జగన్ కు, దాడి ఫ్యామిలీ మీద పెద్దగా నమ్మకం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే పలుసార్లు పార్టీలు మారారు. అందుకే అమరనాథ్ లాంటి యువ నేతకు సపోర్ట్ ఇస్తే మరో 30 ఏళ్ల పాటు పార్టీకి తిరుగుండదని భావిస్తున్నారు.

 

అటు టీడీపీ విషయానికొస్తే...ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఉన్నారు. ఈయన ప్రస్తుతం యాక్టివ్ గానే ఉన్నారు. కాకపోతే తన తనయుడు వల్ల గోవింద్ కు నెగిటివ్ ఉంది. గత ఐదేళ్లు పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్ల గోవింద్ కు మొన్న ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ఇంకా ఆయన పెద్దగా పుంజుకున్నట్లు లేదు.

 

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి 70 శాతం పైనే స్థానాలు దక్కడం ఖాయం. నియోజకవర్గంలో అనకాపల్లి, కశింకోట మండలాలు, అనకాపల్లి మున్సిపాలిటీ స్థానం ఉంది. ఈ మూడు చోట్ల వైసీపీకి బలం బాగానే ఉంది. కాకపోతే టీడీపీ కొన్ని స్థానాల్లో పోటీ ఇచ్చే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: