విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం... మొన్నటివరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు(కన్నబాబు)దే హవా. అసలు టీడీపీ పెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే 1983,1985, 1989, 1994, 1999  ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే తరువాత రమణమూర్తి ఎంటర్ కావడంతో, టీడీపీ విజయాలకు చెక్ పడింది. 2004, 2009  ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

ఆ తర్వాత ఈయన వైసీపీకి వెళ్లి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలకు తిరిగి పుంజుకున్న రమణమూర్తి స్వల్ప మెజారిటీ తేడాతో రమేష్ బాబుని ఓడించారు. అంటే ఇక్కడ టీడీపీ మినహా ఎవరికైనా విజయం దక్కిందంటే అది రమణమూర్తి రాజుకే.

 

ఇక మూడోసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్న రమణమూర్తి...నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా బాగానే చేరువయ్యేలా చేస్తున్నారు. కాకపోతే ఈయన స్థానికంగా పెద్దగా అందుబాటులో ఉండరనే ప్రచారం ఉంది. అయితే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండటంతో, రమణమూర్తి రాజుకు ఎదురులేకుండా ఉంది.

 

మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున ఓడిపోయిన పంచకర్ల...ఆ పార్టీకి రాజీనామా చేసేసారు. త్వరలోనే వైసీపీలోకి వెళ్లే అవకాశముంది. ఇక నియోజకవర్గంపై మంచి పట్టున్న సుందరపు విజయ్ కుమార్ కూడా ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లి పోటీ చేసి ఒక 20 వేలు ఓట్లు తెచ్చుకున్నారు. ఒకవేళ ఈయన టీడీపీలో ఉండుంటే, పంచకర్లకు విజయం దక్కేది.

 

ఇక ఇటు పంచకర్ల పార్టీని వదలడం, అటు సుందరపు విజయ్ జనసేనలోకి వెళ్లడంతో ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడు లేడు. దీంతో రమణమూర్తి దూసుకెళుతున్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి నాయకత్వం లేకపోవడం వల్ల, వైసీపీకి అదిరిపోయే విజయం దక్కడ ఖాయం. నియోజకవర్గంలో ఉన్న రాంబిల్లి, మునగపాక, అచ్చుతాపురం, ఎలమంచిలి మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో టీడీపీ కేడర్ బలంగానే ఉన్న నాయకుడు లేకపోవడం వల్ల, వైసీపీకి అడ్వాంటేజ్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: