తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక మంది నేతలు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ స్థాపించిన వెంటనే జరిగిన 1983 ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో చాలామంది యువ నేతలు జయభేరి మోగించారు. అలా టీడీపీతో రాజకీయ జీవితం మొదలుపెట్టి విజయం సాధించిన నాయకుల్లో శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఒకరు. ఈయన 1983,1985,1994 ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున విజయం సాధించారు.

 

1989, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత 2009 ఎన్నికల్లో ఈయనకు సీటు దక్కలేదు. దీంతో టీడీపీలో ప్రాధాన్యత దక్కడం లేదని వైసీపీలోకి వెళ్లారు. అక్కడ కూడా సరిగా లేదని చెప్పి, మళ్ళీ వైసీపీకి రాజీనామా చేశారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బొబ్బిలి నుంచి గెలిచిన సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి వెళ్ళిపోయారు.

 

దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు జగన్...మళ్ళీ శంబంగిని వైసీపీలోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో బొబ్బిలి సీటు కూడా ఇచ్చారు. ఇక వైసీపీ తరుపున పోటీ చేసి రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీకే చెక్ పెట్టారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావుని చిత్తుగా ఓడించారు. నాలుగోసారి ఎమ్మెల్యే అయిన శంబంగికి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే సమస్యలపై అవగాహన ఉంది. దాని వల్ల సులువుగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీనియర్ నేత కావడంతో అధికారులతో చెప్పి త్వరగానే పనులు చేయించుకోగలుగుతున్నారు. అయితే వయసు మీద పడటంతో వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా? అనేది చెప్పలేం.

 

అటు టీడీపీలో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఉన్నారు. ఈయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా ఈయన వైసీపీ నుంచి రావడంతో, అసలైన టీడీపీ కార్యకర్తలు ఈయనతో ఇంకా కలవలేకపోతున్నారు. మామూలుగానే బొబ్బిలిలో టీడీపీ వీక్ గా ఉంటుంది. ఇప్పుడు పరిస్తితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ టీడీపీకి భవిష్యత్ పెద్దగా కనిపించడం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీదే పైచేయి. బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో వైసీపీ హవా ఉంది. బొబ్బిలి మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: