జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ పెట్టగానే ఆయనతో పాటు నడిచిన నేతల్లో తెల్లం బాలరాజు కూడా ఒకరు. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి అండగా నిలిచారు. వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడైన తెల్లం బాలరాజుకు జగన్ అంటే ఎనలేని అభిమానం. అందుకే అధికారాన్ని సైతం వదులుకున్నారు.  అయితే బాలరాజు రాజకీయ జీవితం కాంగ్రెస్ లో మొదలైంది.

 

2004 లో వైఎస్సార్ అండతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఐదేళ్లు మంచిగా పనిచేయడంతో వైఎస్సార్ మరోసారి బాలరాజుకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో 2009 ఎన్నికల్లో సైతం బాలరాజు సూపర్ విక్టరీ కొట్టారు. కానీ తర్వాత వైఎస్సార్ మరణించడం, జగన్ కాంగ్రెస్ నుంచి బయటకెళ్ళి వైసీపీ పెట్టడంతో, బాలరాజు కూడా అటు వెళ్లిపోయారు.

 

ఆ వెంటనే జరిగిన 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరుపున నిలబడి విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజనతో రాజకీయ సమీకరణాలు మారడంతో, 2014 ఎన్నికల్లో బాలరాజు వైసీపీ తరుపున నిలబడి టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి వచ్చినా...జగన్ ని వదలకుండా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ..పార్టీని బలోపేతం చేసుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో బాలరాజు దాదాపు 40 వేలపైనే మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాసరావుపై విజయం సాధించారు.

 

నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు...నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేసుకుంటున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారికి అండగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వ పరంగా ప్రతి పథకం ప్రజలకు అందేలా చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఎలాంటి పదవులు రాకపోయినా, పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే...ఎన్నికల్లో ఓడిపోయిన బొరగం శ్రీను అంత యాక్టివ్ గా లేరు. పైగా టీడీపీ ఇక్కడ వీక్ అయిపొయింది. ఎస్టీ నియోజకవర్గం కావడంతో వైసీపీ బాగా బలం ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ విజయానికి అడ్డులేదనే చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లైతే పోలవరం వైసీపీకి కంచుకోటగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: