నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా సరే...నెల్లూరు జిల్లాలో వైసీపీదే ఆధిక్యం. మొత్తం 10 సీట్లలో వైసీపీ 7 సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మొత్తం 10 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అటు వైసీపీ అధికారంలోకి కూడా వచ్చింది. దీంతో జిల్లాలో పార్టీ ఇంకా పుంజుకోవాలి.

 

కానీ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇంకా బలపడితే, కొన్ని చోట్ల వీక్ అయినట్లు కనిపిస్తోంది. అలా వైసీపీ వీక్ అయిన నియోజకవర్గాల్లో గూడూరు ముందు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి వరప్రసాద్ రావు పోటీ చేసి విజయం సాధించారు. ఈయన 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున తిరుపతి ఎంపీగా గెలిచారు. అయితే అప్పుడు గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పాశం సునీల్ కుమార్ వైసీపీ తరుపున నిలబడి గెలిచి, తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయారు.

 

ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో జగన్...గూడూరు అసెంబ్లీ సీటు వరప్రసాద్‌కు ఇవ్వగా, టీడీపీ తరుపున సునీల్ కుమార్ నిలబడ్డారు. జగన్ వేవ్‌లో వరప్రసాద్ 45 వేలపైనే మెజారిటీతో గెలిచారు. ఇక ఎమ్మెల్యే గెలిచాక, వరప్రసాద్ నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉన్న సందర్భాలు లేవట. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనుకున్న మేర జరగడం లేదని టాక్. ఇక ప్రభుత్వ పథకాలు మామూలుగానే అందుతున్నాయి.

 

అయితే నియోజకవర్గంలో దందాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీని వల్ల పార్టీకు చెడ్డపెరు వస్తుందని, ప్రజల్లో వ్యతిరేకిత పెరుగుతుందని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. అసలు నెల్లూరు జిల్లాలో బాగా వీక్‌గా ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ అని టాక్. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓడిపోయాక సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేత సునీల్ కుమార్...ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధానాలపై పోరాటం కూడా చేస్తున్నారు. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: