2019 ఎన్నికల్లో జగన్ బొమ్మ ఉండటం వల్ల భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. గెలిచిన 151 మందిలో దాదాపు 100కు పైనే ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్‌తోనే గెలిచారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జనం జగన్‌ని సీఎం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు భారీ మెజారిటీలు కట్టబెట్టేశారు. అలా జగన్ బొమ్మ వల్ల గెలిచిన ఎమ్మెల్యేల్లో అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి కూడా ఒకరు.

 

2009లో ఇదే స్థానం నుంచి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయిన సిద్ధారెడ్డి...2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కందికుంట వెంకట ప్రసాద్‌పై దాదాపు 27 వేల పైనే మెజారిటీతో గెలిచారు. అయితే ఈ మెజారిటీ కేవలం జగన్ బొమ్మ కనబడటం వల్లే వచ్చింది. ఈ విధంగా గెలిచిన ఎమ్మెల్యేపై జనం ఎప్పుడు ఎక్కువగానే ఆశలు పెట్టుకుంటారు. కానీ జనం అనుకున్న విధంగా మాత్రం సిద్దారెడ్డి నియోజకవర్గంలో పనిచేయడం లేదని తెలుస్తోంది.

 

ఏదో ఇక్కడ జగన్ ఇచ్చే పథకాలు తప్ప కొత్తగా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. గెలిచిన మూడు నెలల్లో కదిరి రింగ్ రోడ్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సంవత్సరం దాటిన దాని ఊసులేదు. అండర్ డ్రైనేజ్ పరిస్తితి కూడా అంతే.  అటు నియోజకవర్గంలో వసూళ్లు కూడా బాగానే జరుగుతున్నాయని టాక్. దీని వల్ల ప్రజల్లో బ్యాడ్ నేమ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన సామాజికవర్గాలని వదిలేసి కేవలం సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. అటు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ కూడా ఉందని సమాచారం. వాలంటీర్లు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లే తెలుస్తోంది.

 

ఇక టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ ఈ ఏడాదిలో ఫుల్‌గా పుంజుకున్నారని తెలుస్తోంది. 2004లోనే టిక్కెట్ దక్కపోయిన ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 40 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచిన కందికుంట...2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో మాత్రం 900 ఓట్ల తేడాతో అప్పటి వైసీపీ అభ్యర్ధి అత్తర్ చాంద్ బాషా చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో సిద్ధారెడ్డి చేతిలో 27 వేల తేడాతో ఓడిపోయారు.

 

ఓడిపోయినా సరే కందికుంట ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే సిద్ధారెడ్డిపై వ్యతిరేకిత పెరగడంతో కందికుంటకు ప్లస్ అయింది. మొన్న ఎన్నికల్లో వైసీపీకి ఉన్న న్యూట్రల్ ఓటర్లు...నెక్స్ట్ కందికుంటనే ఎమ్మెల్యేగా గెలుస్తారని చెబుతున్నారు. కాకపోతే అధికారంలో ఉండటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైసీపీకే దక్కుతాయి. అయితే టీడీపీ కూడా పుంజుకుంది కాబట్టి, రెండు మూడు మండలాల్లో సత్తా చాటే అవకాశముంది. మొత్తానికైతే సిద్ధారెడ్డి జగన్ ఇమేజ్‌ని పోగొట్టినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: