కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు సాధారణ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉంటే, 2014లో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. అప్పుడు రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి వీచినా కూడా, కర్నూలులో మాత్రం వైసీపీ హవానే నడిచింది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లాలోని మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

 

అయితే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ రెండుసార్లు గెలిచిన నియోజకవర్గాల్లో ఆదోని ఒకటి, ఇక్కడ జగన్ ఇమేజ్‌తో పాటు, ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి కూడా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఆదోని వైసీపీ కంచుకోటగా మారిపోయింది. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సోదరుడైన సాయి ప్రసాద్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో కేవలం 256 ఓట్ల తేడాతో టీడీపీ నేత meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.

 

తర్వాత వైసీపీలోకి వచ్చేసి, వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో గెలిచిన సాయి ప్రసాద్ రెడ్డి...ఆదోనిలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రతిపక్షానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అధికారులని గ్రిప్ లో పెట్టుకుని కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఆదోని మున్సిపాలిటీలో అవినీతి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, మున్సిపాలిటీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు.

 

ఇక ప్రభుత్వ పథకాలు ప్రజలకు సజావుగానే అందుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కాస్త స్లోగా నడుస్తున్నాయి. పార్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి నాయుడు గట్టిగానే పోరాడుతున్నారు. నాయుడుకు కూడా నియోజకవర్గంలో కాస్త మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ వైసీపీ అధికారంలో ఉండటం, సాయి ప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉండటం వల్ల, ఆదోనిలో టీడీపీ పుంజుకోవడం చాలా కష్టం. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ హవానే నడవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: