ఒక చిన్న మొక్క మహావృక్షం కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ధనవంతుడుగా మారాలి అంటే అది ఒక్క రోజులోనో లేదంటే ఒక సంవత్సరంలోను జరిగిపోయే అద్భుతం కాదు. మన జీవితాన్ని శాసించేది డబ్బు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా లక్ష్యం నిబద్ధతతో జీవనం కొనసాగించిన వారికి మాత్రమే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. 

వాస్తవానికి మన జీవితాన్ని శాసించేది మన నిర్ణయాలే కాని పరిస్థితులు కావు. పేద కుటుంబంలో పుట్టడం శాపం కాదు. డబ్బులేని వాడుగా చనిపోవడమే శాపం. ఈ రెండిటి మధ్య మనిషి పోరాటం చేస్తేనే విజయం సాధిస్తాడు. ప్రపంచ ధనవంతుల చరిత్రను అధ్యయనం చేస్తే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది ప్రపంచ ధనవంతుల జాబితా లిస్ట్‌లో టాప్‌ 5లో ఉండే వారెన్ బఫెట్ జీవితం. ఈయన ఒకరోజు ఒక రోజు సంపాదన 240 కోట్లు. అయితే ఆయన సంపాదనలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు. 

ఒక మనిషి గొప్పతనం అతని సంపాదనలో కాదు ఔదార్యంలో ఉంటుంది అని బఫెట్ చెబుతారు. అందుకే ఆయనను ప్రపంచంలోని గొప్ప ధనవంతుడుగా కాకుండా గొప్ప వ్యక్తిగా సమాజం గౌరవిస్తూ ఉంటుంది. అంతేకాదు డబ్బు సంపాదించాలి అని భావించే ఏవ్యక్తి అయినా ఆయనను స్పూర్తిగా తీసుకుంటారు. 1930 ఆగస్టు 30న జన్మించిన బఫెట్ ఇంటింటికి తిరిగి ఉదయాన్నే న్యూస్ పేపర్ వేసిన విషయం చరిత్ర చెప్పే సత్యం. 11 ఏళ్ల వయసు వచ్చేసరికి బఫెట్ షేర్ మార్కెట్‌లో అడుగు పెట్టాడు. షేర్లు కొనడం అమ్మడం చేసేవాడు. 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే స్థాయికి ఎదిగాడు. స్టాక్ మార్కెట్లలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడిగా బఫెట్ ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆయన వ్యూహాలు పెట్టుబడికి మించి రాబడి సంపాదించడంలో ఆయనకు సాటి వచ్చేవారెవరూ దరిదాపుల్లో కూడా లేరని స్టాక్ ఎనలిస్టులు పేర్కొంటూ ఉంటారు. 

“నేను భవిష్యత్తులో అత్యంత ధనవంతుడిని అవుతానని తెలుసు. ఈ ప్రయత్నంలో ఒక్క నిమిషం కూడా నాపై నేను నమ్మకాన్ని కోల్పోలేదుమీరు ఒక సినిమాకు వెళ్ళకుండా డబ్బులను ఆదా చేయడం సరికాదు. మీ సంతోషాలను త్యాగం చేసి మరీ పొదుపు గురించి ఆలోచించడం కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. ఒక సంతోషకరమైన ఆనందాన్ని అనుభూతి చెందకుండా వాయిదా వేయడం అనేది సరైన ఇన్వెస్టర్‌కు ఉండాల్సిన లక్షణం కాదు.”అయితే బలమైన నిర్ణయం తీసుకుంటేనే  విజయం లభిస్తుంది అంటూ విజయం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. నిజంగా దాన్ని గుర్తించలేకపోవడం నిజంగా జీవితంలో ఓటమి అంటూ వారెన్ బఫెట్ అనేక సార్లు స్పూర్తిదాయకంగా చెపుతూ ఉంటారు. అందుకే కలలు కనడం కాదు ఆ కలలను సాకారం చేసుకుంటేనే విజయం వస్తుంది అన్న అబ్దుల్ కలాం మాటలను స్మరించుకుంటూ ఇక నుండి ప్రతిరోజు ఎలా సంపాదించి అక్షయ పాత్రలా మార్చుకోవాలో ప్రతిరోజు ఈ శీర్షికలో తెలుసుకుందాం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: