పూర్వకాలంలో ఋషులు అష్టసంపదలు గురించి భోధన చేసేవారు. నిజానికి ఆ అష్టసంపదలు ఉన్నవాడే నిజమైన సంపన్నుడు. అయితే ప్రస్తుత తరానికి ఆ అష్టసంపదలు గురించి బాగా చదువుకున్న వారికి కూడ అంతగా తెలియదు. 

భగవద్గీత లో చెప్పబడ్డ ఈ అష్ట సంపదలలో మొదటిగా చెప్పుకోతగ్గది బ్రహ్మానందం. ఆరోగ్య సమస్యలు లేకపోవడం వంటి విషయాలు ఈ బ్రహ్మానందం లోని సారాంశం. ఈసంపద కలిగిన తరువాత ఈ అష్టసంపదలలో ముఖ్యంగా చెప్పుకోతగ్గది ఆత్మానందం. వస్తు సంమృద్ధి వలన కలిగే ఆనందాన్ని ఆత్మానందం గా  చెపుతారు. 

ఈ అష్టసంపదలలో అతి ముఖ్యమైనది విద్యానందం విద్య - జ్ఞానం వలన మాత్రమే ఐశ్వర్య వంతుడు అవుతాడని గీతలో చెప్పబడింది. ఇక అష్టసంపదలలో మరొకటి వాసనానందము. గతంలో మనం చేసిన పనులు లేదా సుకృతం వలన ఐశ్వర్యం లభిస్తుంది. ఈ అష్ట సంపదలు ఉన్నప్పటికీ తనకన్నా గొప్పవాడు లేడు అని తెలిసినప్పటికీ అద్వైతానందం ఉన్నవాడి దగ్గర మాత్రమే ధనం శాస్వితంగా నిలబడుతుంది అని చెపుతారు ఇక ఈ అష్ట సంపదలలో దాసులు దాశీలు మిత్రులు బంధువులు వాహనములు ఇవన్నీ పొంది ఉన్న వ్యక్తి మాత్రమే నిజమైన ధనవంతుడుగా గుర్తింపు పొందుతాడని ఈ సంపదలలో ఏ ఒక్క సంపద లేకపోయినా ఆ వ్యక్తి ఐశ్వర్య వంతుడు కాడు అని గీతలో చెప్పబడింది.

డబ్బు ఒక రాక్షసి కాదనీ దానిని పూర్తిగా ప్రేమించగలిగిన వాడి దగ్గరర డబ్బు ఉంటుందని డబ్బు సంపాదించాలి అంటే మోసమే మార్గం అనుకునే వారు ధనవంతులు అవ్వలేరనీ అంటారు. అయితే డబ్బు సంపాదన అంటే కేవలం ఆర్ధిక సంబంధమైన సంపాదన అన్న భావం ఉన్నప్పటికీ మనం చేసే పనిలో ఏపని వినూత్నంగా చేయగలము అన్న భావన ఉన్నవారు మాత్రమే ఐశ్వర్య వంతులు అవుతారని అంటారు. ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తికి విజయంలో ఆనందం కలుగుతుంది అదే యోగానందం అంటారు. డబ్బు సంపాదించాలి అంటే ఆ డబ్బు కోసం మనిషి ధర్మయుద్ధం చేయాలి. అయితే ఈ యుద్ధంలో మహాభారతంలో లా కౌరవులు పాండవులు ఉండరు. మనిషికి ఎదురు అయ్యే పరిస్థితులే శతృవులు. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉండాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: