డబ్బు పొదుపు చేయటం కూడా ఒక కళ. అవసరాలకు తగ్గట్టు ఒక క్రమపద్ధతిలో డబ్బు ఖర్చు చేయటం మిగిలినది భవిష్యత్తు కోసం పొదుపు చేయటం మంచిదని అందరికి తెలిసిన విషయమై అయినా ఈవిషయంలో కొందరు మాత్రమే తమ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకు రాగలుగుతారు వారు మాత్రమే ధనవంతులు కాగలుగుతారు. డబ్బు పొదుపు చేయడం అంటే ప్రతి చిన్న విషయంలోను దుబార చేయకుండా ఉండటం. అంతేకాని అవసరాలకు కూడా ఖర్చు చేయకుండా తాము ఇబ్బంది పడుతూ ఇంట్లో వారినీ ఇబ్బంది పెడుతూ అతిగా పొదుపుచేయటం కాదు. 

వాస్తవానికి ఈఅలవాటు ఒక్కరోజులో వచ్చేది కాదు. సంపాదన మొదలవ్వగానే డబ్బును మేనేజ్ చేయటం వస్తుందనుకోవటం పొరపాటు. అదిమన చిన్నతనం నుండి రావాలి. డబ్బు విలువ చిన్నప్పటి నుంచి తెలిసినవారు పెద్దయిన తరువాత డబ్బును చక్కగా మేనేజ్ చేయగలుగుతారని అనేక మంది మనీ ఎక్స్ పర్ట్శ్ అభిప్రాయ పడుతూ ఉంటారు. దీనికోసం  తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నప్పటి నుండి డబ్బు విలువ తెలియచేయాలి.  

పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారికి ప్రతినెల ఇచ్చే పాకెట్ మనీని వారి ఇష్టాలు అవసరాలు ఎలా  విభజించి ఖర్చుచేయాలో తల్లి తండుద్రులు చిన్నతనం నుండి శ్రద్ధ వహించి తెలియచేస్తే పిల్లలు పెద్ద అయ్యాక వారికి వచ్చే ఆదాయాన్ని సులువుగా మేనేజ్ చేసుకో గలుగుతారు. దీనితో ఆర్థిక క్రమశిక్షణ కూడా చిన్నతనం నుంచి అలవాటుపడి ఆ పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక చాలా సులువుగా మనీ ఎక్స్ పర్ట్స్ గా మారి పోతారు. 

ఈనాడు సమాజంలో పెద్దపెద్ద పారిప్రశ్రామిక వేత్తలుగా ఎదిగిన చాలామంది మధ్య తరగతి నేపధ్యంలోని కుటుంబాల నుంచి రావడంతో సహజంగా మధ్య తరగతి కుటుంబాలు రేపటిరోజున దృష్టిలో పెట్టుకుని చేసే ప్లానింగ్ పెద్ద వ్యాపార సంస్థల ఫైనాన్స్ మేజేజ్ మెంట్ కు చాల సులువుగా సహకరిస్తుంది. అందుకే పొడుపు తెలిసిన  వాడి దగ్గర మాత్రమే ఐశ్వర్యం ఉంటుంది వారు మాత్రమే విజేతలు కాగలుగుతారు అని అంటారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: