‘పేదవాడుగా పుట్టడం తప్పుకాదు పేదవాడుగా మరణించడం తప్పు’ అని అనేక సార్లు చెపుతారు ఒకప్పటి అత్యంత పేదవాడు ఇప్పటి ప్రపంచ ధనవంతుల లిస్టులో అగ్రగామిగా కొనసాగుతున్న బిల్ గేట్స్. పేదరికం అనేది చేయని నేరానికి శిక్ష అనుభవించడం లాంటిది అని బిల్ గేట్స్ అభిప్రాయం. గట్టి సంకల్పానికి శ్రమ కూడ తోడు అయినప్పుడు మాత్రమే ఎవరైనా చాల తేలికగా పేదరికం నుండి బయటపడగలుగుతారు. 

పేదరిక భావన మనసు నుండి తొలిగించుకున్ననాడే ఒక వ్యక్తి మానసిక ధనవంతుడుగా మారగాలుగుతాడు. ఆ తరువాత అతడు వరసపెట్టి చేసే ప్రయత్నాలకు కృషి తోడైతే ఖచ్చితంగా ధనవంతుడుగా మారగాలుగుతాడు. డబ్బు నిప్పు లాంటిది అని అంటారు. ఆ డబ్బుతో విలాసాలు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు లేదంటే అదే డబ్బును మరిన్ని రెట్లు పెరిగేలా తెలివిగా ఉపయోగించి సంపదను పెంచుకోవచ్చు. 

దీనితో డబ్బు గురించి మనకు ఎలాంటి అభిప్రాయం ఉండాలో ప్రతి మనిషికీ ఒక క్లారిటీ రావాలి అప్పుడే విజయం దక్కుతుంది అదే సంపద రహస్యం. అయితే డబ్బు ఉన్న వాళ్ళు అంతా స్వార్ధపరులు వారంతా అన్యాయాలు చేసి ధనవంతులుగా మారారు అని అభిప్రాయపడే వ్యక్తి దగ్గరకి ఎప్పుడు డబ్బు రాదు. డబ్బు పై మోజు ఉంటే సరిపోదు ఆ డబ్బును ఎలా తెలివిగా సంపాధించుకోవాలో శక్తివంతమైన గెలుపు వ్యూహాలు ఆలోచన చేయగలిగిన వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలుగుతాడు. 

అందుకే డబ్బు పాపిష్టిది అని తెట్టే వారిని ఎవరినైనా డబ్బు లేకుండా బ్రతికి చూపించమని ప్రఖ్యాత ఆంగ్ల రచయిత సోమర్ సెట్ మాం తన రచనలలో అనేకసార్లు ప్రస్తావించారు. అందుకే కాబోలు డబ్బును గురించి చులకనగా మాట్లాడేవారు దగ్గర డబ్బు ఉండదు అంటూ అభ్యుదయ కవి ఆరుద్ర ఒక పాటలో వ్రాశారు. దీనితో మనకు ముందు డబ్బు గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో మనకు మనం ఆలోచించుకోగలిగినప్పుడు మాత్రమే ఏవ్యక్తి అయినా నిజంగా ధనవంతుడు అవ్వగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి: