ఆర్ధికంగా ఎంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఎంతో కొంత పొదుపు చేసి తీరుతాడు. మనం చేసే ఖర్చులు అన్నీ ప్రతిరోజు ఒక పుస్తకంలో వ్రాసుకుని ఆ తరువాత చూసుకుంటే వృథా ఖర్చులు ఏమిటో చాల సులువుగా తెలిసి వస్తాయి. ఇలా మనకు మనం విశ్లేషణ చేసుకుంటే మన ఖర్చు అన్నీ మన అదుపులోనే ఉంటాయి అని ఆర్ధిక విశ్లేషకులు చెపుతూ ఉంటారు.

మన సంపద మన సంపాదనలో ఉండదు మనం చేసే పొదుపు పులోనే ఉంటుంది. మనం పొదుపు చేసిన డబ్బుతో ఒక చిన్న ఆస్థిని కూడపెట్టుకోగలిగితే అదే మనకు భవిష్యత్ లో సంపదగా మారుతుంది. అందుకే అత్యంత ధనవంతుల దగ్గర నుండి సామాన్యుల వరకు తమ సంపాదనలో కనీసం పది శాతం పొదుపు చేయగలిగితే వారు ఖచ్చితంగా ఐశ్వర్య వంతులు అయి తీరుతారు అంటూ అనేకమంది మేధావులు చెపుతూ ఉంటారు. 

ఈ సందర్భంలో నేటి యంగ్ హీరో నాగచైతన్య తన కుటుంబంలో తనకు డబ్బు విలువ తెలిసి వచ్చేలా తన తండ్రి నాగార్జున తనను పెంచిన తీరును ఈమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలియచేసాడు. దీనితో సంపన్నులు కూడ డబ్బుకు ఎలాంటి విలువ ఇస్తారో అర్ధం అవుతుంది. ‘బార్న్ విత్ గోల్డెన్ స్పునే అయినా అమ్మా నాన్నలు నన్ను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా పెంచారు. గారాబం చేస్తూ అడిగినంత డబ్బు అస్సలు ఇచ్చేవారు కాదు. ఏదైనా కావాలని అడిగినప్పుడు ఎంత బ్రతిమాలినా అంత ఈజీగా వచ్చేది కాదు. అవసరం అయితేనే కొనేవారు. ఖరీదైన కాస్ట్లీ లైఫ్ ఉండేది కాదు. న్యాచురల్ గానే ఉండడం నాకు అలవాటైంది. చాలా సార్లు డబ్బు సంపాదించడం చాలా కష్టం అని అమ్మ చెప్పేది. నా దగ్గర ఎన్ని కోట్లున్నా అవసరం అనుకున్న దానికోసమే ఖర్చు పెడతా. అమ్మా నాన్నల వల్లే డబ్బు విలువ తెలుసుకున్నా. సినిమా విషయంలో కూడా డబ్బు వృధాగా పోతుంటే మనసు ఒప్పుకోదు. ఈ విషయాలను నాకు పిల్లలు పుట్టాక కూడ వారికి తెలిసి వచ్చేలా చేస్తా.’ అంటూ చైతు చెప్పిన అనుభవాలు చదివిన వారికి అక్కినేని కుటుంబం కూడ డబ్బు ఖర్చు విషయంలో ఎంత పొదుపుగా ఉంటారో అర్ధం అవుతుంది.

ఇదే సందర్భంలో ఒక ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త చెప్పిన విషయాలను అందరం గుర్తుంచుకోవాలి. ఒక మనిషి ఆర్ధకంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అతని ప్రతి కోరికను తీర్చగల శక్తి అతడి దగ్గర ఉన్న సంపద తీర్చదు  అన్న విషయం తెలుసుకోగలిగితే ప్రతి వ్యక్తి వారివారి స్థాయిలో ఐశ్వర్య వంతుడే అవుతాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: