ఓటమి పట్ల భయం లాగే ఈరోజు చాలామందికి గెలుపు పట్ల భయం కూడ పెరిగిపోతోంది. జీవితంలో గెలిచిన వాడికే డబ్బు వస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం సప్త వ్యసనాలకంటే మించిన వ్యసనంగా డబ్బు సంపాదన మారిపోయింది. ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదన ధ్యాసలో పడి కాలాన్ని కుటుంబాన్ని సమాజాన్ని మరచిపోతున్నవారు ఎందరో. చివరకు తమని తామే మరచిపోతారు. డబ్బే ధ్యేయం డబ్బే లక్ష్యం డబ్బే మార్గం  అన్న స్థితిలో నేటి మానవ సంబంధాలు మారిపోతున్నాయి. 

ప్రస్తుతం కూలి చేసుకునే వాడు కూడ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన సంపాదన స్థాయికి మించిన ఆనందాలను పొందాలని ఆరాట పడుతున్నాడు. ఈ ఆరాటం పులి పై మనిషి స్వారీగా మారడంతో ఈ స్వారీ ఆలా సాగాల్సిందే. దీనితో డబ్బు సంపాదన విషయంలో నైతికం అనైతికం అన్న మార్గాలు ఎప్పుడో సమసిపోయాయి. 

ఈ కారణాలతో మనిషిలో అశాంతి మరి కొందరిలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. డబ్బు సంపాదన అవసరమే కానీ డబ్బే సర్వస్వం కాదు అవసరం మేరకు డబ్బు సంపాదించండం అవసరం. డబ్బు సంపాదన మాత్రమే కాదు. డబ్బు ను ఖర్చు పెట్టడం ఒక కళ. అయితే నేటితరంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు ఆశ వేరు కృషి వేరు. 

లాటరీ టిక్కెట్ తగాలాలి అనుకోవడం ఆశ మన ఆదాయం పెరగాలి అని కోరుకోవడం కోరిక. ఈ రెండింటి మధ్య తేడా చాలామందికి తెలియక పోవడంతో మానసిక అశాంతి పెరిగిపోయి చాలామంది తమ ధ్యేయాన్ని మరిచిపోతున్నారు. వాస్తవానికి మన విద్య విధానంలో కూడ ఇలాంటి విషయాలను తెలియ చెప్పే అంశాలు లేకపోవడంతో ప్రతివ్యక్తి డబ్బే సర్వస్వంగా జీవిస్తున్నాడు. వాస్తవానికి ఈరోజు సమాజంలోని చాలామందికి తాము చేసే ఖర్చుల పై నియంత్రణ ఉండటం లేదు. రాబడి కోసం ఎంత సమయం ఖర్చుపెట్టాలి ప్రశాంతత కోసం ఎంత సమయం ఖర్చు పెట్టాలి అన్న తేడా తెలియక పోవడంతో చాలామంది డబ్బు మాత్రమే సర్వసం అన్నట్లుగా జీవిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: