ప్రపంచంలో సంపదను ఆశించని వ్యక్తులు ఉండరు. అయితే ధనవంతులు కావాలని ఆశించినా తాము ఎంచుకున్న మార్గంలో ఎదురయ్యే ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుని నిలబడే వ్యక్తి దగ్గర మాత్రమే ధనం వచ్చి చేరుతుంది. అయితే ఈ లక్ష్యంలో వచ్చే ఎదురీతను ఎదుర్కుని వ్యక్తికి నిబద్ధత ఉండాలి అప్పుడే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. 

ఈ లక్ష్యంలో ప్రయాణించే వ్యక్తికి అతడి జీవన ప్రయాణంలో ఎన్నో అనూహ్య సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. అంతేకాదు ప్రతి వ్యక్తికి తాను ఎంచుకున్న జీవన ప్రయాణంలో లక్ష్యాలను చేరుకునే మార్గంలో అనుకోకుండా కొంతమంది సహాయ సహకారాలు కూడ అందుతూ ఉంటాయి. 

అయితే ఇలాంటి సహాయ సహకారాలు మనం ఎంచుకున్న లక్ష్యం పై ఆధారపడి ఉంటుంది. ఒక మంచి లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యానికి సహకరించే వ్యక్తులు తారసపడతారు. మనం ఎంచుకున్న లక్ష్యంలో క్లారిటీ లేకుండా ఆ లక్ష్యం అందరికీ అన్యాయమైనది అదేవిధంగా అసాధ్యమైనది అని అనిపించినప్పుడు ఎవరు ఏ వ్యక్తికి సహాయం చేయరు. 

ప్రపంచంలో మనకు కనిపించే దృశ్య ప్రపంచం వెనుక అదృశ్య ప్రపంచం చాల పెద్దదిగా ఉంటూ మనం ఎంచుకున్న లక్ష్యాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది మన ఎంచుకున్న లక్ష్యం మంచిది అయినప్పుడే అదృశ్య ప్రపంచంలోని శక్తులు కూడ మనకు సహకరిస్తాయి అని వేదాంతులు చెపుతూ ఉంటారు. అయితే ఆ శక్తుల ప్రోత్సాహం మనం ఎంచుకున్న లక్ష్యంలోని మంచి గుణం అదేవిధంగా మన ఉత్సాహం చురుకుదనం బట్టి మనకు విజయం లభించి తద్వారా ఆ విజయంతో సంపద మనకు కలుగుతుంది. ‘పని అంటూ మొదలు పెట్టని వ్యక్తికి దేవుడు కూడ సహాయం చేయడు’ అనే ఫ్రెంచ్ సామత ఉంది. ఆరు నూరైనా నూరు ఆరైనా మనం ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టి సంకల్పంతో అడుగులు వేసే వ్యక్తి మాత్రమే నిత్య విజేతగా మారి ఐశ్వర్య వంతుడు కాగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి: