భగవద్గీత లో శ్రీకృష్ణుడు రెండు రకాలైన సంపదలను గురించి చెప్పాడు. ఒకటి దైవ సంపద రెండవది రాక్షస సంపద. కోపం బంధం దుఖం రాక్షస సంపదలు అయితే నిజాయితీ నిగ్రహం శాంతం దయ ప్రతిభ ఓర్పు నిగర్వం లాంటివి దైవ దంపదలు. ఈ దైవ సంపదలు కలిగిన బ్యాక్తే జీవితంలో ఐశ్వర్య వంతుడుగా మారగలడని వేదాంతులు అంటారు.

వాస్తవానికి డబ్బు డబ్బును సంపాదిస్తుంది. అత్యాశకు శక్తికి మించిన పనుల పై ప్రయోగాలు చేయకుంటే ప్రతి వ్యక్తికి తమతమ స్థాయిలలో ఖచ్చితంగా ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు. జీవితంలో ఎదో ఒక పని చేయడానికే మనం పుట్టలేదు అన్న విషయం నిజమే అయినా ఎదో ఒక పని చేస్తేనే డబ్బు వస్తుంది అప్పుడే మనిషికి సంతోషంగా ఉంటుంది.

ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే వ్యక్తి పుట్టుకతో ధనవంతుడు అయినప్పటికీ అతడు తన జీవితాన్ని ఎంజాయ్ చేయలేడు. కాలం విలువ యవ్వనం విలువ గమ్యం విలువ తెలిసిన వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలుగుతాడు. జీవితంలో ఏది పోయినా సంపాదించుకోవచ్చు ఆరోగ్యం ధనం బంధుత్వం ఇలా ప్రతి విషయాన్ని మనం సంపాదించుకోవాలి అంటే విలువలు తెలియాలి. ఆ విలువలు తెలిసిన వ్యక్తికే కాలం విలువ తెలిసి ధనవంతుడు గా మారగాలుగుతాడు.

నిజానికి తనకు నచ్చిన పని చేయగలిగిన వ్యక్తి మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతాడు. అయితే సమాజంలో చాలామంది తమకు ఏ పని నచ్చుతుందో తమకే తెలియని పరిస్థితులలో రొటీన్ పనులు చేస్తూ ఉండి పోవడంతో జీవితం నిస్సారం అనిపించి మనిషి యంత్రం లా మారిపోయి జీవితంలో గెలిచే సమర్ధత ఉన్నా ఓడిపోతూ ఉంటాడు. అందు వల్లనే ప్రతి వ్యక్తి తమ గమ్యాన్ని ఎంచుకోవడమే కాకుండా ఆ గమ్యం విలువ తెలియాలి అలాంటి వ్యక్తిని సంపద వరిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితాంతం పని చేయలేడు. ఒకమాటలో చెప్పాలి అంటే రేపటి నుంచి తాను పనిచేయక పోయినా తనకు ఎంతకావాలో ముందుగానే ఊహించుకుని కష్టపడే వారి దగ్గర మాత్రమే సంపద వచ్చి చేరుతుంది. దీనికోసం ప్రతి వ్యక్తి దైవ సంపదను నమ్మకోవాలి అదే సంపాదకు మార్గం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: