డబ్బు పాపిష్టిది అని తిట్టేవాళ్ళు ఎవరైనా ఆ డబ్బు లేకుండా బ్రతికి చూపించమని ప్రముఖ ఆంగ్ల రచయిత సోమర్ సెట్ మాం తన వ్యాసాలలో అనేకసార్లు ప్రస్తావించాడు. డబ్బు సంపాదించడం అంటే చెట్లకు కాయలు పువ్వులు పూయించినంత సులువు కాదు.

అందువల్ల డబ్బు సంపాదన ఒక కళగా గుర్తింపు బడుతోంది. శ్రమకు విలువ తెలియని వారు మాత్రమే నిరంతరం డబ్బును వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆర్ధిక విజ్ఞానం సరిగ్గా లేని వారు మాత్రమే సంపద గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. 

నిన్న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా తొమ్మిది మంది పారిశ్రామిక వేత్తలకు పారిశ్రామిక పద్మాలు గా పద్మ పురస్కారాలు ఇచ్చారు. వీరిలో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న వేణు శ్రీనివాసన్ గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఒక ఉత్తేజం కలుగుతుంది. టివి ఎస్ గ్రూప్ అధినేతగా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్ టివి ఎస్ సంస్థ తయారు చేసిన మోపెడ్ లు భారతదేశ గ్రామీణ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించి అతి తక్కువ ఆదాయం కలిగిన వారు కూడ టూ వీలర్స్ ను కొనుక్కునే లా ఈ పారిశ్రామిక దిగ్గజం అనుసరించిన వ్యూహాలు వాహన రంగంలో ఒకసరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టాయి. 

అదేవిధంగా మన హైదరాబాద్ లో పుట్టి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుని కెనడా వెళ్ళి అక్కడ ఒక భీమా కంపెనీని ఏర్పాటు చేసి ప్రస్తుతం కెనడా దేశంలో ఇండియన్ వారెన్ బఫెట్ గా పిలవబడుతున్న ప్రేమ్ వత్స కు కూడ పద్మ పురస్కారం లభించింది. వీరిద్దరూ ఇలా అద్భుతమైన విజయాలు సాధించడానికి వీరు సంపదను ఒక ఆస్థిగా కాకుండా ఒక దైవం లా భావిస్తూ నిరంతరం చేసిన కృషి ఇలా ఎవరైతే డబ్బు సంపాదనను అపార్ధం చేసుకోకుండా డబ్బును గౌరవిస్తారో వారి దగ్గర మాత్రమే ఐశ్వర్యం వచ్చి చేరుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: