కాలం విలువ గమ్యం విలువ తెలియనివాడు జీవించినా వాడు కేవలం జనాభా లెక్కలు మాత్రమే పరిమితం అవుతారు. మనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల గురించి గంటల గంటల కొద్ది చర్చిస్తూ సమయాన్ని వృథా చేసుకునే వారు ఈదేశంలో ఎందరో ఉన్నారు. 

ఒక లేటెస్ట్ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం యువతలో చాలామంది రోజుకు సుమారు నాలుగు గంటలు తమ స్మార్ట్ ఫోన్ లో రకరకాల న్యూస్ లు చదువుతూ విచిత్రమైన వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారు అన్నది వాస్తవం. ప్రస్తుతం ఆనందించ తగ్గ పని చేస్తున్న వాళ్ళు ఆ చేస్తున్న పనిలో ఆనందం వెతుక్కునే వారు చాల అరుదుగా కనిపిస్తున్నారు అంటూ అనేకమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 

ప్రస్తుత పోటీ వాతావరణంలో ఏ వ్యక్తి అయినా రాణించి విజయం సాధించి ఆపై ధన వంతుడుగా మారాలి అంటే కాలం విలువ యవ్వనం విలువ గమ్యం విలువ పూర్తిగా తెలియాలి. ఏవ్యక్తి అయినా డబ్బు సంపాదించాలి అని అనుకున్నప్పుడు అతడి యవ్వన దశ నుండి ప్రయత్నాలు ప్రారంభించాలి కానీ జీవితం సగం అయిపోయిన తరువాత కాలం విలువ గమ్యం విలువ తెలుసుకున్న వారు కేవలం ప్రయత్నించే వారి లిస్టులో చేరుతారు కాని విజేతలుగా మారరు. 

గాంధీ నుండి టంగుటూరి వరకు ఠాగూర్ నుండి టెండూల్కర్ వరకు వీరంతా వారి జీవన ప్రారంభ దశలో సామాన్యులుగానే కొనసాగారు. అయితే గమ్యం పై లక్ష్యం ఏర్పరుచుకున్నారు కాబట్టే తమకి మిగతా వారికీ మధ్యగల తేడాను గ్రహించి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదగ గలిగారు. మన తెలుగు రాష్ట్రాలలో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గ్రంధి మల్లికార్జున రావు ఈరోజు ఫోర్బ్స్ పత్రిక ప్రకటించే సంపన్నుల లిస్టులో స్థానం సంపాదించాడు అంటే ఆయన ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నా ఆ వ్యాపారాన్ని ఒక పనిలా కాకుండా ఒక యజ్ఞం లా భావించి రోజుకు 16 గంటలు కష్టపడిన కృషి ఫలితం కనిపిస్తుంది. ఈ విధంగా ఎవరైతే కాలం విలువ శ్రమ విలువ తెలుసుకున్నవాడు మాత్రమే ధనవంతుడు కాగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి: