జీవితంలో ప్రతి ఒక్కరిని ఎదో ఒక దశలో ఎదో ఒక విషయంలో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి లక్ష్యాలను సాధించాలి అనుకుంటే భయం అన్నది మనిషి ఆలోచనకు కూడ రాకూడదు. దీనితో విజయాన్ని కోరుకునే ఏ వ్యక్తి అయినా భయం అన్న భావాన్ని తన ఆత్మ విశ్వాసంతో పారద్రోలిగలిగినప్పుడు మాత్రమే విజయం వరించి తద్వారా ఐశ్వర్యం కలుగుతుంది.


ప్రతివ్యక్తికి ఆరు భయాలు ఉంటాయి అని మనస్తత్వ వేత్తలు చెపుతారు. విమర్శల పట్ల భయం – అనారోగ్యం పీడిస్తుందనే భయం – దారిద్రంలో కూరుకు పోతాము అనే భయం – వృద్ధాప్యం అంటే భయం – ఒక వ్యక్తి ప్రేమను కోల్పోతామనే భయం _ మరణం పట్ల భయం. ఇలా ఈ ఆరు భయాలు వల్ల చాలామంది అను నిత్యం ఆలోచనలు చేస్తూ తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పరాజయం పొంది ద్వారా డబ్బును సంపాదించే విషయంలో కూడ విఫలం అవుతున్నారు.


వాస్తవానికి ఈ ఆరు భయాలు ఎక్కడి నుంచి పుడతాయి అన్న విషయమై ప్రతివ్యక్తికి వారివారి మనస్తత్వం బట్టీ కుటుంబ నేపధ్యం బట్టీ ఆలోచనలు ఏర్పడతాయి. ముఖ్యంగా విమర్శలకు భయపడే వ్యక్తి జీవితంలో ఏమి సాధించ లేడు. తాను చేసే పని ఎక్కడ తిరస్కరణకు గురి అవుతుందో అన్న భయంతో చాలామంది అనేక పనులు చేయగల శక్తియుక్తులు ఉన్నప్పటికీ ఆ పనులు అసలు ప్రారంభించడమే మానేస్తారు.


వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇలా ఏ రంగంలో అయినా విజయం సాధించాలి అన్నా ఆ కోరుకున్న విజయం మనలను వెతుక్కుంటూ వస్తుందనే భ్రమంలో గడపడం అవివేకం. ఏ పని చేయడానికి సాహసించని వారికి వైఫల్యం ఎప్పుడు వారి చెంతనే ఉంటుంది. ఇక ఈ భయాలు వల్ల నిరంతరం ఆలోచించే వారు రేపటి రూపాయి ఎలా వస్తుంది అన్న ఆలోచనలో కాలం గడుపుతారు తప్ప ఆ రూపాయి గణించే మార్గాల గురించి అన్వేషణ చేయరు. విజయ సూత్రాల సారాంశం మనిషి ఈ ఆరు భయాలను పోగొట్టుకోవడమే..

మరింత సమాచారం తెలుసుకోండి: