ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి అంటే ముందుగా అవసరమయ్యేది సంపన్న మనస్థత్వం. ప్రతి వ్యక్తి తాను పేదవాడిని అన్న భావాన్ని మనసు పొరల్లోంచి తొలిగించుకోనంత కాలం ఏవ్యక్తి సంపద సృష్టించలేడు. కారును కనిపెట్టిన హెన్రీ ఫోర్డును ‘మీరు సంపాదించిన 100 కోట్ల డాలర్ల సంపద కోల్పోతే ఎంచేస్తారని’ అని ఒక విలేఖరి అడిగితే ఫోర్డ్ తడుము కోకుండా పోగొట్టుకున్న డబ్బును 5 సంవత్సరాలలో సంపాదిస్తాను అంటూ జవాబు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.


ఈ సమాధానం ఫోర్డ్ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాకుండా అతడి మనస్తత్వాన్ని సూచిస్తోంది. మనం మనసులో దేనినైతే గట్టిగా నమ్ముతామో చివరకు అదే జరిగి తీరుతుంది దీనినే మనస్తత్వ శాస్త్రంలో పిగ్ మాలియన్ ఎఫెక్ట్ అని అంటారు. అందుకే మన మనసులో ఉండే నమ్మకాలకు శక్తి అనూహ్యంగా ఉంటుంది.


నమ్మకాలు అవకాశాలకు వారధి లాంటివి మనకుండే నమ్మకాలకు అనుగుణంగానే మనకు అవకాశాలు కనిపించడం కనిపించక పోవడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో అనేకమంది ధనవంతులు ఎదో ఒక సందర్భంలో వారి దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే అలా పోగొట్టుకున్న వారు అంతా వారు కోల్పోయిన డబ్బు కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించిన సందర్భాలు చరిత్రలో కనిపిస్తాయి.


మనిషి బుద్ధి మనస్తత్వం ఊహా శక్తి బట్టి మాత్రమే మన భవిష్యత్ ఏర్పడుతుంది. వాస్తవానికి మన మైండ్ ఒక పెద్ద అయస్కాంతం లా పనిచేస్తుంది. దీనితో మన ఆలోచనలు ఎలా ఉంటే మన మైండ్ ఆ ఆలోచనలకు అతుక్కుపోతు మన చర్యల పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. మట్టిలో నాటకపోతే గింజలు మొక్కలుగా మహా వృక్షాలుగా మారవు. అదేవిధంగా మన మైండ్ లో సంపాదకు సంబంధించిన ఆలోచనా బీజాలను నాటినప్పుడు మాత్రమే ఆ ఆలోచనలు మనలను  ధనవంతులుగా చేయగలుగుతుంది. అందుకే మనిషి మనసులోకి రాకుండా ఈ ప్రపంచం లోకి వచ్చే సంపద ఏదీ ఉండదు అని అంటారు. అందువల్లనే సంపద మనస్తత్వం కలిగి ఉన్న వారు మాత్రమే ఐశ్వర్యం పొందగలుగుతారు..    

మరింత సమాచారం తెలుసుకోండి: