మనిషికి జీవితంలో రెండు బాధలు ఉంటాయి. ఒకటి క్రమశిక్షణ పాటించడం కలిగే బాధ రెండవది క్రమశిక్షణ పాటించక పోవడం వలన వచ్చే బాధ. వాస్తవానికి ఇతరులతో పని చేయించడం చాల తేలిక. అయితే మనతో మనం పని చేయించుకోవడమే చాల కష్టం అవుతుంది. అయితే అలా తన శరీరాన్ని అదేవిధంగా మేధస్సును కష్టపెట్టి కృషి చేసిన వ్యక్తి మాత్రమే సంపదను పొందుతాడు.


వాస్తవానికి బాహ్య ప్రపంచంలో విజేతగా నిలవాలి అంటే ముందు ప్రతి వ్యక్తి తన అంతర్ ప్రపంచంలో విజయం సాధించాలి. అందుకు ఒక క్రమశిక్షణ మాత్రమే ఆయుధంగా పని చేస్తుంది. పరీక్ష పాస్ అవ్వాలి అంటే బాగా చదవాలి అలాగే బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి. సన్నగా నాజూకు గా ఉండాలి అంటే తక్కువ తినాలి అదేవిధంగా సంపద సృష్టించి ధన వంతుడుగా మారాలి అంటే ఆర్ధిక విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అయితే చాలామందికి స్వయం క్రమ శిక్షణ అనేది చాల తక్కువగా ఉంటుంది.


దీనితో చాలామంది ఎవరో ఒకరు తమని నియంత్రించాలి అని కోరుకుంటూ ఉంటారు. స్వయం నియంత్రణ గురించి పెద్దగా ఆసక్తి కనపరచరు. మనం చేయవలసిన మనం చేయకుండా ఎదుట వారిచేత చేయించాలి అని ఆలోచించడమే మనలో స్వయం నియంత్రణ శక్తి కోల్పోతున్నాము అని చెప్పడానికి ఉదాహరణ. ఎన్నో నైపుణ్యాలు మరెంతో సమర్ధత ఉన్న వ్యక్తులు కూడ ధనవంతులు కాలేకపోవడానికి ఈ స్వయం నియంత్రణా శక్తి లేకపోవడమే.


ఇలాంటి తిరోగమన మనస్తత్వాన్ని మొగ్గలోనే తమ ఆలోచనల నుండి తొలిగించుకోగల వ్యక్తులు మాత్రమే విజేతులుగా మారి ఆతరువాత ఐశ్వర్య వంతులుగా మారుతారు. మనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడ మనం తీసుకోలేక ఇతరులు ఇచ్చే సలహాల వైపు ఎదురు చూసే వ్యక్తులు జీవితంలో రాణించలేరు. అందువల్లనే చాలమంది ధనవంతులు అవ్వడానికి ప్రయత్నిస్తారు కాని విజయాన్ని సాధించలేరు. అందువల్లనే స్వయం క్రమ శిక్షణతో అడుగులు వేయగల వ్యక్తిని మాత్రమే లక్ష్మీదేవి కరుణిస్తుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: