డబ్బే డబ్బు :  సంపాదనకు అడ్డుగోడ భావదారిద్ర్యం !

సామాన్యులను సంపన్నులు గాను కుచేలురను కుభేరులుగాను మార్చగల శక్తి మన మనసుకు ఉంది. మన మనసు పేదరిక ఆలోచనలతో నిండి ఉంటే ఎప్పటికీ సంపద దరిచేరదు. వాస్తవానికి ఒక వ్యక్తి పదేపదే తాను పేదవాడిని అనే విషయం గుర్తుకు చేసుకుంటూ ఉంటే ఆ భావన మన మనసులో స్థిరంగా ఏర్పడిపోయి ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా తాను పేదవాడిగానే మిగిలిపోతాడు.


పేదరికం అనేది చేయని నేరానికి శిక్ష అనుభవించడం లాంటికి పేదవాడిగా పుట్టిన ఏవ్యక్తి జీవితం పేదరికంతో ముగియకూడదు అన్నసంకల్పం ఉంటేనే ఆవ్యక్తి తన పేదరికాన్ని తొలిగించుకోలేడు. ‘పేదవాడిగా పుట్టడం నీతప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం ఖచ్చితంగా నీ తప్పే’ అని ప్రపంచ ప్రఖ్యాత సంపన్న వ్యక్తి బిల్ గేట్స్ అంటూ ఉంటారు.


అదేవిధంగా ఒక సమస్య ఉన్నప్పుడు పదేపదే దానిని గుర్తుకు చేసుకుని మధన పడేవారు ధనవంతులు కాలేరనీ దీనికి కారణం దృష్టి అంతా ఆ సమస్య పై ఉండటంతో మనసు ఆ సమస్య పరిష్కారానికి అన్వేషణలు చేస్తూ సంపద పెంపుదల గురించిన ఆలోచనలను పక్కకు పెడుతుంది అని మనీ ఎక్స్ పర్ట్స్ అంటూ ఉంటారు. ప్రపంచ జనాభాలో కొద్ది శాతం వ్యక్తులను మినహాయిస్తే అత్యధికుల జీవితాలు డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.


జీవితంలో డబ్బు ఒక్కటే సర్వసం కాదు అని వేదాంతులు చెపుతూ ఉన్నా మనిషి జీవితానికి డబ్బు ప్రాణవాయువుతో సమానం అని గుర్తించి తీరాలి. చాలినంత డబ్బు లేకుండా ప్రతిభతో ఉన్నత శిఖరాలను చేరుకున్న వ్యక్తులు మన సమాజంలో చాలామంది ఉన్నా అలా ఒక మనిషి ఎదగాలి అంటే ఎంతో కృషి పట్టుదల ఉండాలి. అందుకే విజయానికి అడ్డదారులు ఉండవు అని అంటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా చాలామంది ప్రయత్నాలు చేస్తూ తాము డబ్బు సంపాదించే విషయంలో పరాజయం చెందుతున్నాము అన్న భావనలో తమ జీవితాలను కొనసాగిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: