ప్రేమకు లొంగని వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉండరు ప్రతి వ్యక్తిలో బలం బలహీనతలు సుగుణాలు దుర్గుణాలు అన్నీ కలిసి ఉంటాయి. వాటన్నింటిని ఒకే రకంగా స్వీకరిస్తూ ఎదుటి వ్యక్తిని ప్రేమించగల వ్యక్తి దగ్గర మాత్రమే ఐశ్వర్యం వచ్చి చేరుతుందని అంటారు. అందుకే ఆత్మీయ సంబంధాలు మాత్రమే కాదు మానవ సంబంధాలు కూడ బాగా కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతాడు.


ప్రతి వ్యక్తికి అనేక సమస్యలు ఉంటాయి అయితే ఆ సమస్యల పట్ల సరైన దృక్పదం లేకపోతే జీవితంలో ఆనందం ఉండదు. దీనితో జీవితంలో సమస్యలు ఎదుర్కునే ప్రతి వ్యక్తి తమ సమస్యల గురించి ఆలోచనలు చేస్తూ వాటిని భూతద్దంలో చూస్తూ సమస్య తీవ్రతను పెంచుకుంటూ ఉంటారు.


అయితే సమస్య తీవ్రత గురించి ఆలోచన చేయడం కంటే ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచించే వ్యక్తి మాత్రమే విజయాన్ని అందుకుని ఆ తరువాత ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు. అందుకే ‘ప్రతి కూలమైన ఆలోచనలు ఈ ప్రపంచంలోకి వదిలితే అవి మరింత బలపడి తిరిగి వచ్చి మనలను చుట్టుముట్టి తీరుతాయి’ అంటూ ప్రముఖ మనీ ఎక్స్ పర్ట్ వ్యక్తిత్వ వికాశ నిపుణుడు నార్మెన్ విన్స్ సెంట్ పీలే అభిప్రాయ పడుతున్నారు.


జీవితంలో మనం ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి విజయంగా మారి ఆ విజయం తో  ఐశ్వర్యం వస్తుంది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవు. అయితే ప్రేమించే మనస్తత్వాన్ని కోల్పోయిన వ్యక్తికి మాత్రం ఎంత ప్రయత్నించినా విజయం రాదు సరికదా ఆర్ధికంగా తాను కోరుకున్న లక్ష్యాలను కూడ చేరుకోలేడు. అందుకే గౌతమ బుద్ధుడు భోధనలలో మొఖం మీద చెరగని చిరునవ్వు ఉంటే చాలు విజయం ఐశ్వర్యం అక్కడే స్థిరంగా ఉంటుంది అన్న మాటలు మనకు కనిపిస్తాయి. దీనితో ప్రేమతో జీవితానికి సంబంధించిన ప్రతిక్షణం ఆనందమయం చేసుకున్న వారు మాత్రమే సంపద రహస్యం తెలుసుకుని విజేతలుగా మారుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: