ప్రతి వ్యక్తి అనుక్షణం విజయం గురించే ఆలోచిస్తాడు విజయం రాకుండా సంపద ఉండదు. అయితే ఓటమి తరువాత మాత్రమే విజయం వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఓటమిని అంగీకరించడానికి ఏ వ్యక్తి ఒప్పుకోడు. అయితే ఓటమి అనేది చాల లాభదాయకమైన మానవ అనుభవం అన్న విషయాన్ని కనీసం ఎవరు గుర్తించరు.


అందుకే ఓటమి అన్నది మారువేషంలో ఉన్న ఆశీర్వాదం అంటూ ప్రముఖ మనీ ఎక్స్ పర్ట్ వ్యక్తిత్వ వికాశ నిపుణుడు డాక్టర్ హిల్ తన పుస్తకాలలో అనేకసార్లు ప్రముఖంగా ప్రస్తావించారు. అదృష్టం దురదృష్టం అనే చక్రం మనచుట్టూ ఒక వలయంలా తిరుగుతూనే ఉంటుంది. అయితే కోట్లాది మంది మాత్రం ఓటమిని శత్రువుగా చూస్తూ అనేక పొరపాట్లు చేస్తూనే ఉంటారు. 


మనం ఊహించని విధంగా డబ్బు పోగొట్టుకున్నప్పుడు ఆ డబ్బు గురించి బాధ పడేబదులు తిరిగి సంపాదించడం మొదలు పెడితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కానీ కేవలం ఆవేదనతో ఎన్ని సంవత్సరాలు గడిపినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. నిజమైన విజేత ఓటమిని తాత్కాలిక పరాజయంగా భావిస్తాడు తప్ప ఆ ఓటమి శాస్వితం అనుకోడు. వాస్తవానికి ఏ వ్యక్తికైనా ఓటమి స్వయంకృతాపరాధమే అంటూ బిల్ గేట్స్ తన స్వీయ చరిత్రలో ఉదాహరణలతో అనేకసార్లు వివరించాడు. 

 

అందుకే ఓటమి అంతం కాదు మరో కొత్త మార్గాన్ని అన్వేషించడానికి దొరికిన అవకాశం అని భావించిన వ్యక్తులే ఐశ్వర్య వంతులు కాగలుగుతారు అని అనేకమంది మనీ ఎక్స్ పర్ట్ లు తమ ఉపన్యాసాలలో చెపుతూ ఉంటారు. నేటిరోజు దురదృష్టం రేపటి అదృష్టంగా మారుతుంది అని గట్టి నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మాత్రమే విజేత కాగలుగుతాడు. ‘థింక్ అండ్ గ్రో రిచ్’ అనే పుస్తకం వ్రాసిన డాక్టర్ హిల్ వైఫల్యం గురించి మాట్లాడుతూ మన వ్యక్తిత్వంలోని అవలక్షణాలు వైఫల్యాలుగా బయట పడతాయని వాటిని గుర్తించి సరిచేసుకోగల వ్యక్తి మాత్రమే విజయ తీరాలకు చేరుకొని ఆ తరువాత సంపన్నుడుగా మారుతాడు అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా వైఫల్యాన్ని అంగీకరించ లేని వ్యక్తి ఐశ్వర్య వంతుడు కాలేడు..

మరింత సమాచారం తెలుసుకోండి: