హద్దు అదుపు లేని భావోద్వేగాలు మన వ్యక్తిత్వం పై విపరీతమైన ప్రభావం చూపెట్టడమే కాకుండా ఆ భావోద్వేగాల వల్ల మన ఆలోచనా శక్తి నశించి మనం ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోలేము. ఈ భావోద్వేగాలు మరీ ఎక్కువైపోయిన వ్యక్తి అదుపు తప్పి నేరస్తులుగా మారే ఆస్కారం ఉంది.


విజయం సాధించాలి అనుకున్న ప్రతి వ్యక్తిలోనూ తమ భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన సమతుల్యత ఉండాలి. నియంత్రణ కోల్పోయిన వ్యక్తి మనసులో ఏమి జరుగుతుందో అతడికే తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే భావోద్వేగాలు అణిచిపెట్టుకోవడం అంత సులువైన పని కాదు. దీనికోసం ఎంతో మానసిక సక్తితితో పాటు మన ఆహారపు అలవాట్లు కూడ చాల మార్చుకోవలసి వస్తుంది. స్వయం నియంత్రణ అంటే కోపం ఉద్వేగం తగ్గించుకోవడం మాత్రమే కాదు.


మనలో ఉన్న బలహీనతలను తగ్గించుకోవడమే స్వయం నియంత్రణ. ఒక్క మాటలో చెప్పాలి అంటే జీవన యుద్ధంలో మనకు ఎదురయ్యే నిరాశా నిస్పృహల పై నియంత్రణ సాధించడమే స్వీయ నియంత్రణ. ఈ లక్ష్యానికి చేరుకునే విషయంలో ప్రస్తుతం చాలామంది ఆధ్యాత్మిక వాదుల సలహాలను తీసుకుంటున్నారు. అయితే ఆధ్యాత్మిక వాదులు చెప్పే విషయాలు మన మనసులకు వెళ్ళకుండా కేవలం యాంత్రికంగా ఆ మాటలను వింటూ కాలం గడిపితే గంటలు వృథా అవుతాయి కాని స్వీయ నియంత్రణ అలవడదు.

 

మన ఆలోచనలు మీద పట్టు సాధించినప్పుడే మన చర్యల పై పట్టు ఏర్పడి ఆ పట్టు భవిష్యత్ కు సహకారంగా పనికి వస్తుంది. బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి ధనవంతులు కూడ తమ భావాలను నియంత్రించుకోవడంలోనే తమ విజయ రహస్యం అంటూ అనేకసార్లు చెప్పిన పరిస్థితులలో ప్రపంచ స్థాయి ధనవంతులు కూడ ఈ స్వీయ నియంత్రణ ను పాటిస్తున్నారు. అందుకే నెపోలియన్ హిల్ లాంటి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు స్వీయ నియంత్రణ లోనే సంపద ఉంటుంది అంటూ అభిప్రాయ పడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి: