ఓటమి అనేక సాకులను వెతుకుతుంది. అయితే విజయం మటుకు ఎలాంటి సంజాయిషీలను కోరదు. ఓటమి పాలైన వ్యక్తి అనేక సాకులను చూపెడుతాడు. అయితే విజయం సాధించిన వ్యక్తి మాత్రం ఒకే కారణం చెపుతాడు ఆ కారణం సరైన నిర్ణయం.


అయితే ఒక నిర్ణయానికి బద్ధ శత్రువు తాత్సారం. ప్రతి ఒక్కరిలో ఒక కనిపించని శత్రువు ఉంటాడు. ఆ శత్రువు సాకులను వెతికే లక్షణం. ఈమధ్య ప్రపంచ స్థాయి ధనవంతుల పై జరిపిన ఒక విశ్లేషణలో ఒక ఆశ్చర్యకర విషయం బయట పడింది. ప్రపంచ స్థాయి ధనవంతులు అంతా తమ విజయానికి సంబంధించిన ఒక విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బయటపెడుతున్నారు.

వారు జీవితంలో ప్రపంచ స్థాయి ధనవంతులుగా ఎదగడానికి గల కారణం వారు ప్రతి విషయంలో త్వరితంగా తీసుకునే నిర్ణయాలు. అయితే సంపద సంపాదించదానికి ప్రయత్నించి ఘోరంగా విఫలైన వారు అంతా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్లనే వారు ధనవంతులు కాలేకపోయారు అని చెప్పే అధ్యయనాలు కూడ ఉన్నాయి. ప్రపంచ ధనవంతుడుగా పేరు గాంచిన హెన్రీఫోర్డ్ జీవితాన్ని కూలంకుషంగా పరిశీలిస్తే అతడి వ్యాపారానికి సంబంధించిన విషయాలలో అతడు వేగంగా తీసుకున్న నిర్ణయాలు అతడిని ప్రపంచ స్థాయి ధనవంతుడుగా మార్చాయి అని అంటారు.

ఏ గొప్ప వ్యక్తి జీవితాన్ని పరిశీలించినా ఆవ్యక్తి తాను తీసుకున్న నిర్ణయానికి జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అయితే ఓటమి చెందిన వ్యక్తి మటుకు తన నిర్ణయాలు క్షణక్షణం మార్చేసుకుంటూ ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ లో కొనసాగుతూ ఉంటాడు. సాధారణంగా చాలమంది జీవితంలో ఓటమి చెందడానికి గల కారణం తనకు తానుగా ఆలోచించకోకుండా ఎదుట వ్యక్తి అభిప్రాయాలకు విలువను ఇస్తూ చాల సులువుగా తన నిర్ణయాలు మార్చుకోవడం అని మనీ ఎక్స్ పర్ట్ లు చెపుతూ ఉంటారు. ఇతరుల అభిప్రాయాలకు వారి ప్రభావానికి లోనయ్యే వ్యక్తులు తమ ప్రగాఢ వాంచలను మధ్యలోనే వదిలేసి పరాజితులుగా మారిపోతు ఉంటారు. అందుకే సంపన్నులుగా మారేవారు వారికి వారు స్థిర నిర్ణయాలతోనే సంపన్నులు అవ్వగలరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: