పేదరికం గురించి భయపడని మనిషి ఈ ప్రపంచంలో ఉండడు. పేదరికం మనిషి ఆలోచనల పై దెబ్బ తీసి అతడి సృజనాత్మకతను నిర్వీర్యం చేస్తుంది. ఇలా మనిషి పేదవాడుగా మారడానికి ప్రధానంగా ఈ కారణాలు అతడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ కారణాలలో ముఖ్యంగా పేర్కొన తగ్గది స్వీయ చేతనం – సంభాషణలలో పిరికితనం కొత్త వాళ్ళను కలవడానికి ఇబ్బంది పడే వారిని ఈ స్వీయ చేతనం గలవారు అని అంటారు.


అదేవిధంగా ఒక వ్యక్తి తన కంఠస్వరం పై నియంత్రణ లేకుండా ఇతరులకు ఇబ్బంది పడేలా మాట్లాడుతూ మన్నన పొందలేకపోవడం కూడ ఒక వ్యక్తిని సంపద నుండి దూరం చేసే ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొంటారు. ఇక ముఖ్యంగా ఈ కారణాలలో చాల ప్రముఖంగా పేర్కొన దగ్గది వ్యక్తిత్వం – సమస్యలను దాటవేసే మనస్తత్వం ఉండటమే కాకుండా అనుక్షణం ఆత్మన్యూనతా భావంతో రగిలిపోతు తమ అపజయాలను అంగీకరించ లేక ఊహలలో తేలిపోతూ ఆ ఊహలలో తాము చాల అధికులం అన్న భావన ఉన్నవారు కూడ సంపదను అందుకోలేరు.


ఈ సంపదను దూరం చేసే విషయాలలో ముఖ్యంగా చెప్పుకోతగ్గది ఆడంబరం – అతిగా అలంకరించు కోవడం తాము ఇతరులు కన్నా అధికులం అని చాటుకోవడానికి తమ ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే ఈ లక్షణాలు ఎదో విధంగా అధిగమించినా ఒక వ్యక్తికి చొరవ లోపిస్తే తాను జీవితంలో ఏమి సాధించలేడు. తన అభిప్రాయాల పై తనకే నమ్మకం లేకపోవడం దాటవేసి సమాధానం ఇవ్వడం వ్యవహార శైలిలో జంకును ప్రదర్శించే వ్యక్తులకు చొరవలేదు అని అంటూ ఉంటారు.


ఇక చివరిగా ఒక వ్యక్తి ధనవంతుడు కాకుండా అడ్డుపడే ప్రధాన లక్షణం ఆశయ రాహిత్యం – మానసికంగా శారీరకంగా ఎప్పుడూ బద్ధకంతో ఉండటం సొంత అభిప్రాయాలు లేకపోవడం నిర్ణయాలు తీసుకోవడంలో మందకొడితనం ఇలా అనుక్షణం నెగిటివ్ లక్షణాలతో ఉండే వ్యక్తులు ఎంత చదువుకున్నా మరెంత విజ్ఞాన వంతులు అయినా ఐశ్వర్య వంతులు కాలేరని మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతూ ఉంటారు. ఇలాంటి నెగిటివ్ లక్షణాలు అన్నీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఐశ్వర్య వంతుడు కాగలడు..   

మరింత సమాచారం తెలుసుకోండి: