డబ్బు పంట పండించాలి అంటే మన దగ్గర డబ్బు విత్తనాలు ఉండాలి. డబ్బు విత్తనాలు అంటే మన సంపాదనలో మనం పొదుపు చేసే పది శాతం మొత్తాన్ని తిరిగి మనకోసం డబ్బు గణించడానికి డబ్బునే విత్తనాలు అని భావించవచ్చు. అయితే సాధారణ మధ్య తరగతి వ్యక్తులు తమకు వచ్చే డబ్బు ఆదాయం తమ జీవితాలకే సరిపోదు అలాంటి పరిస్థితులలో పొదుపు ఎలా చేసేది అని మధన పడుతూ ఉంటారు.


అయితే కొద్దిగా తెలివితేటలు ఉపయోగిస్తే మనకు వచ్చే ఆదాయంలో పది శాతం పొదుపు చేయడం పెద్ద కష్టం కాదు. అయితే దీనికి కొన్ని సూత్రాలను అమలు చేయాలి. సూపర్ మార్కెట్ లో కొనే బదులు మన నిత్యావసరాలను హోల్ సేల్ మార్కెట్ లో కొంటే కిరాణ బిల్లు 20 శాతం నుండి 30 శాతం వరకు ఆదా అవుతుంది. 


దీనికితోడు కొన్ని వస్తువులు కొన్ని సీజన్స్ లో బాగా చవకగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పప్పులు బియ్యం మార్కెట్ లోకి రాగానే వాటిని కనీసం 6 నెలలకు సరిపడే విధంగా కొనుక్కుంటే డబ్బు బాగా ఆదా అవుతుంది. అదేవిధంగా కూరగాయలను పండ్లను సూపర్ మార్కట్ లో కంటే రైతు బజారులో కొనేవారికి డబ్బు బాగా ఆదా అవుతుంది. ఇక ఇళ్ళల్లో తరుచు చాలామంది తమ పనుల హడావిడిలో లైట్లు ఫ్యాన్స్ ఎసి లు ఆన్ చేసి వాటిని ఆపడం మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి మతిమరుపును తగ్గించుకుంటే ఇలాంటి మన కరెంట్ బిల్లులలో కూడ పొదుపు జరిగి ఆదా అవుతుంది.


అదేవిధంగా మరికొందరైతే తమకు అవసరం ఉన్నా లేకపోయినా బయటకు వెళ్ళినప్పుడల్లా ఎదో ఒక వస్తువులను టైమ్ పాస్ కు కొంటూ ఉంటారు. వాస్తవానికి ఆ వస్తువులు అవసరం లేకపోయినా డిస్కౌంట్లు ఇచ్చారు అన్న ఆలోచనలతో ఎప్పుడో ఉండే అవసరాలకు ముందుగానే కొంటూ తమ డబ్బును అంతా వృథా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి వృథా ఖర్చులు అన్నీ తగ్గించుకుని డబ్బును పొదుపు చేసి ఆ డబ్బును పెట్టుబడిగా మార్చ గలిగితే డబ్బు విత్తనంగా మారి ఆడబ్బే మరింత సంపదను సృష్టిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: