జీవితాన్ని శాసించేది మన నిర్ణయాలు మాత్రమే పరిస్థితులు కావు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా మనలను బయట పడవేయగలిగేది సత్వర నిర్ణయాలు మాత్రమే ‘స్వర్గానికి వెళ్ళడానికి కోరిక అందరికీ ఉంటుంది కాని మరణించడానికి ఎవరు సిద్ధపడరు.’ అనే ప్రెంచ్ సామెత ఉంది.


అలాగే ధనవంతులు అవ్వాలని ప్రతి వ్యక్తి కలలు కంటాడు కాని దానికి అవసరమైన కార్యాచరణ ఏ వ్యక్తి చేపట్టాడు దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఆశించడం తప్పులేదు కానీ ఆశించడం కన్నా ఆ ఆశను సాకారం చేసుకోవడానికి కావలసిన కార్యాచరణను చాల కొద్దిమంది మాత్రమే రూపొందించుకుంటారు. అలా రూపొందించుకున్నవారు మాత్రమే ఐశ్వర్య వంతులు కాగలుగుతారు.


వాస్తవానికి ఒక వ్యక్తి పదివేలు సంపాదించే విషయంలోనూ లక్ష సంపాదించే విషయంలోనూ ఒకేలా కష్టపడతాడు అయితే ప్రతి వ్యక్తి సంపాదన మరొక వ్యక్తి సంపాదనతో పోల్చే విధంగా ఉండపోవడానికి గల కారణం అతడు జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలు మాత్రమే. మనకు కావలసిన డబ్బును ధైర్యంగా కోరుకోవడంలో తప్పులేదు కానీ ఆ డబ్బు మనం సంపాదించగలమా లేదా అన్న విషయమై సందిగ్ధంలో కొనసాగుతూ ఉంటే అతడి ఆలోచనలు అన్నీ సందేహాలతోనే ముగిసిపోతాయి.


అందుకే మనం డబ్బును కోరుకునే ముందు ఆ సంపాదనకు అనువైన మార్గాలను కూడ ముందుగానే ఆలోచించి స్పష్టమైన నిర్దిష్ట ప్రణాళికలను వేసుకోవాలి. దీనికితోడు ప్రతి వ్యక్తికి డబ్బు విషయంలో ఏర్పరుచుకునే లక్ష్యాలు చాల పెద్దవిగా ఉండాలి. చిన్న లక్ష్యాలతో జీవన ప్రయాణాన్ని మొదలుపెడితే జీవితం సగం పూర్తి అయ్యేసరికి బొటాబొటీగానే జీవితం మారిపోతుంది. ఒక పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి తాను ఒకపని ప్రారంభించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట 15 శాతం పని పూర్తిచేసే వరకు మాత్రమే అడ్డంకులు వస్తాయి. ఆ ప్రారంభ దశలో వచ్చే అడ్డంకులను నిరాశ పడకుండా వ్యతిరేక పరిస్థితులను కూడ తనకు అనుకూలంగా మార్చుకోగలిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి లక్ష్య సాధనలో మొదటి అడుగు వేసి విజయవంతుడై సంపదను పొందగలుగుతాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: