కొత్త భావాలను సందేహించడం మానవ నైజం అయితే ఏదైనా ఒక వ్యాపారంలో కానీ ఒక విషయంలో కానీ కొత్తగా ఆలోచనలు చేసే వారికే సంపదతో పాటు విజయం కూడా లభిస్తుంది. ఒక వ్యక్తి తన విధికి తానే కారకుడని తత్వవేత్తలు చెపుతారు. అయితే ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులకు ప్రభావితం కాకుండా వాటిని ఎదిరిస్తూ కొత్తకొత్త ఆలోచనలు చేసినప్పుడు మాత్రమే ఏ వ్యక్తికైనా విజయం లభిస్తుంది. 


ప్రతి వ్యక్తి ఆలోచనలు తన అంతఃకరణ శుద్ధితో లోతుగా విశ్లేషించు కోవాలి. అలా విశ్లేషించుకున్నప్పుడు మాత్రమే మనం ధనం సంపాదించాలి అని పెట్టుకున్న వాంఛను సాకారం చేసుకోగలుగుతాము. అదేవిధంగా మనం కోరుకున్న డబ్బు మన ఇంటిలో వచ్చినట్లు మనం ఆ ధనసంపదల మధ్య ఉంటున్నట్లుగా ఊహించుకోవడమే కాకుండా ప్రతిరోజు మనం నిద్ర లేవగానే మనం ఇంత సంపాదించాలి అని వ్రాసి పెట్టుకున్న తీర్మానాన్ని ఒకటికి పదిసార్లు చూస్తే అది పాజిటివ్ ఎనర్జీని మనకు కలిగించి మనం కోరుకున్న మొత్తం గణించే విధంగా మనం కష్టపడేందుకు ఒక మానసిక స్థైర్యం కలుగుతుంది. 


ఈ విషయాలు చాలామందికి అస్పష్టంగా అనిపించడమే కాకుండా అవాస్తవికాలు అని కూడ అనిపిస్తాయి. అయితే ఈ విషయాలను ఆచరణలో పెట్టి ఎందరో ధనవంతులు అయిన విషయం తనకు తెలుసు అంటూ మనీ ఎక్స్ పర్ట్ నెపోలియన్ హిల్ తన పుస్తకంలో అనేక సందర్భాలలో తెలియచేసాడు. 


అయితే ఇలా ఆలోచనలు చేస్తూ మన మనసును మహిమాన్వితం చేసుకోవడానికి ఒక వ్యక్తి తన ఇంటిలో ఒక ప్రసాంతమైన ప్రదేశాన్ని ఎంచుకుని ఒక దీప కాంతిని ఊహించుకుని ఆ కాంతిని మన శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించే విధంగా ప్రయత్నించే వ్యక్తికి మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేసించి మన మనసును మహిమాన్వతం చేసి మన లక్ష్యాలను చేరుకునేల చేసి మనలను ఐశ్వర్య వంతులుగా మారుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: