పట్టుదల మానసిక స్థితి దాన్ని అభ్యాసంతో సాధించవచ్చు పట్టుదలకు ధన సంపాదనకు చాల అవినాభావ సంబందిం ఉంది. ప్రపంచంలో ఐశ్వర్య వంతులుగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఏ ప్రముఖుడి జీవితాన్ని పరిశీలించినా అతని జీవితంలో సాధించిన విజయాలకు పట్టుదల క్రియాశీలకంగా ప్రభావితం చేసింది అన్న విషయం చాల సుస్పష్టంగా అర్ధం అవుతుంది.


అయితే ఈ పట్టుదల కలిగిన వ్యక్తికి కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. పట్టుదల పెంపొందించుకోవడంలో చాల స్పష్టంగా ప్రభావితం చేసే లక్షణం స్పష్టమైన ప్రయోజనం. ఒక స్పష్టమైన ప్రయోజనాన్ని ఆశించే వ్యక్తి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలను చాల సులువుగా అధిగమించగలుగుతాడు. ఇక పట్టుదలకు సంబంధించి పేర్కొనవలసిన రెండవ లక్షణం ప్రగాఢ వాంఛ.


ఏ వ్యక్తికి అయినా అతడికి ఉండే కోరిక ప్రగాఢ వాంఛగా మారితే దాన్ని సాధించు కోవడం కోసం ఎటువంటి కష్టానికైనా ఆ వ్యక్తి సాహసిస్తాడు. ఒక వ్యక్తి విజయానికి ప్రణాళిక కూడ అవసరం అవ్వడంతో ఆ ప్రణాళిక పూర్తిగా విజయవంతంగా అమలు జరిపే వ్యక్తికి స్వావలంబన కూడ చాల అవసరం. దీనికితోడు చేసేపనిలో నిర్దిష్ట పరిజ్ఞానం కూడ మన పట్టుదల సడలిపోకుండా పరోక్షంగా సహకరిస్తుంది. అయితే చాలామంది పట్టుదల సంకల్పబలం రెండు ఒకటే అని భావిస్తారు. అయితే సంకల్పం వాస్తవరూపం దాల్చాలి అంటే దానికి పట్టుదల ఉండాలి.


ఒక క్రమ బద్ధమైన అలవాటును పట్టుదలగా భావిస్తారు. ప్రతిరోజు ఒక విద్య నేర్చుకోవాలి అని మనకు మనం ఏర్పరుచుకున్న సంకల్పం మన చేతలలో స్థిరంగా మారిపోవడమే పట్టుదల అని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. అందుకే పట్టుదల విలువ తెలిసిన వ్యక్తులు మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతారు. పట్టుదల ఉన్న వ్యక్తికి మానసిక జడత్వం ఉండదు. జీవితుంలో ఎదురయ్యే పరీక్షలకు తట్టుకుని నిలబడ్డ ప్రతివ్యక్తికి పట్టుదల ఉంటుంది. ప్రతి ఓటమి తరువాత సక్సస్ తీసుకువస్తుంది అన్న నమ్మకం ఉన్న వ్యక్తులు మాత్రమే సంపద అందుకోవడానికి సంసిద్ధులు అవుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: