ఒక వ్యక్తి తాను ధనవంతుడు అయితీరాలి అని నిశ్చయించుకున్నంత మాత్రాన సంపద వచ్చి చేరదు. ప్రతివ్యక్తి తాను ఎంచుకున్న లక్ష్యానికి సంబంధించి తాను ఎంతవరకు విజయం సాధించడానికి ముందుకు వెళుతున్నాను అని స్వీయ విశ్లేషణ చేసుకోవడానికి ప్రతివ్యక్తి తనకు తానుగా ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకోవాలి. ఆప్రశ్నా పత్రంలో తాను ఎంచుకున్న లక్ష్యానికి అవసరమైన సమర్థవంతమైన సేవలు అందించగలిగానా లేదా అదేవిధంగా తన పనితీరు మెరుగుపడిందా లేదా అన్నవిషయం నిరంతరం విశ్లేషణ చేసుకోవాలి. 


అంతేకాదు పోటీని తట్టుకునేలా తాను ప్రవర్తిస్తూ తన ప్రణాళికలు అమలు చేయడంలో పట్టుదలతో వ్యవహరించానా లేదా అనే విషయం కూడ నిరంతరం స్వీయ విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా తన వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకునే విధంగా తన చర్యలు ఉన్నాయా లేదా అన్న విశ్లేషణ కూడ నిరంతరం చేసుకుంటూ ఉండాలి. 


తన ప్రయత్నంలో ఏకాగ్రత లోపించడం వల్ల తనలో సహనం తగ్గిపోయిందా అని వ్యక్తిగత విశ్లేషణ కూడ చేసుకునే వ్యక్తి మాత్రమే విజయానికి దగ్గరలోకి వెళ్ళి ఆ తరువాత తాను కోరుకున్న సంపద లక్ష్యాల వైపు అడుగులు వేయగలుగుతాడు. ఒకవేళ తాను చేస్తున్న పనిలో వరస పరాజయాలు వస్తుంటే తన పనిలో లోపం ఉందా అన్న విశ్లేషణలు కూడ చేసుకోవాలి. ఇలాంటి విషయాలలో తాను ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని అహంకారాన్ని ప్రదర్శిస్తూ తాను అందరికీ శత్రువుగా మారుతున్నానా అన్న ఆలోచనలు కూడ ఈ స్వీయ విశ్లేషణ ప్రశ్నాపత్రం ద్వారా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తనకు తానుగా అంచనాలు వేసుకోవాలి. 


ఇక తాను అందిస్తున్న సేవలు తానే వినియోగాదారుడుని అయితే తాను అలాంటి సేవలను అంగీకరిస్తానా అన్న ఆలోచనలు చేయగలిగితే మన స్వీయ ప్రశ్నాపత్రంలో మనకు మనమే రేటింగ్స్ వేసుకుని మనం ఎంచుకున్న గమ్యాలను చేరుకోవడానికి ఇంకా ఎలాంటి మార్పులు చేసుకోవాలో చాల సులువుగా అంచనాలు వేసుకోవచ్చు. కనీసం వారానికి ఒకసారి అయినా ఎవరికి వారు ఇలాంటి స్వీయ విశ్లేషణా ప్రశ్నాపత్రానికి నిజయితీగా సమాధానాలు ఇవ్వగలిగితే మనం ఎంచుకున్న సంపద లక్ష్యం చేరుకోవడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో మనకు మనకే అర్ధం అవుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: